కుబేర చాలా అద్భుతంగా వచ్చింది -నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు

kuberaa Producers Asian Suniel and Puskur Ram Mohan Interview

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ , కింగ్ నాగార్జున,రష్మిక మందన్న నటించిన సినిమా కుబేర. ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి. సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు.కుబేర తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కుబేర ప్రాజెక్టు ఎలా మెటీరియలైజ్ అయింది?

శేఖర్ కమ్ముల గారు లవ్ స్టోరీ తర్వాత ఈ ఐడియాని మాకు చెప్పడం జరిగింది.ఈ కథకు ధనుష్ గారు అయితే బాగుంటుందని ఆయన భావించారు. ఆయనకి ఈ కథని చెప్పారు. ధనుష్ గారు కథ 20 నిమిషాలు విని వెంటనే సైన్ చేశారు. తర్వాత ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశాం.ధనుష్ గారు పాన్ ఇండియా స్టార్. ఆయన హిందీలో కూడా సినిమాలు తీశారు. నాగార్జున గారు కూడా ఎప్పటినుంచో హిందీ సినిమాల్లో ఉన్నారు. రష్మిక గారి గురించి అందరికీ తెలుసు. ఇండియాలో ఆమె పాపులర్ యాక్ట్రెస్. కథకి అనుగుణంగానే ఇంత బిగ్ స్టార్ కాస్ట్ తో ఈ సినిమాని చేయడం జరిగింది.ధనుష్ గారు నాగార్జున గారు రష్మిక గారు అందరూ అద్భుతంగా సపోర్ట్ చేశారు.కుబేర తెలుగు, తమిళ్ స్ట్రయిట్ మూవీ. హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నామ. ఫస్ట్ కాఫీ ఆల్రెడీ రెడీ అయింది. సినిమా అద్భుతంగా వచ్చింది.

శేఖర్ కమ్ముల గారు ఫస్ట్ టైం ఇంత బిగ్ స్టార్ కాస్ట్ తో సినిమా చేస్తున్నారు కదా? ఇది ఎంత డిఫరెంట్ గా ఉండబోతుంది ?

శేఖర్ కమ్ముల గారు మాకు చాలా ఇష్టమైన డైరెక్టర్.ఆయన లీడర్ సినిమా ఎప్పుడు చూసినా సరే చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది.ఈసారి మరింత బిగ్గర్ స్టార్ కాస్ట్ తో తీశారు. ఖచ్చితంగా ఆడియన్స్ కి చాలా న్యూ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది. చాలా డిఫరెంట్ మూవీ ఇది.

కుబేర కాన్ఫ్లిక్ట్ ఏమిటి?

మోస్ట్ రిచెస్ట్ మాన్ ఇన్ ద వరల్డ్, ది పూరెస్ట్ మ్యాన్ ఇన్ ది స్ట్రీట్స్ ఇది కాన్ఫ్లిక్ట్.

కుబేర కథలో మిమ్మల్ని ఎక్సైజ్ చేసిన ఎలిమెంట్ ఏమిటి?

శేఖర్ గారు మంచి ఎమోషన్స్ తో ఆడియన్స్ ని టచ్ చేస్తూ ఫీల్ ఉండే సినిమాలను తీస్తారు. ఈ సినిమా కూడా అలాంటిదే. ఇందులో ఉండే ఎమోషన్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి.

షూటింగ్ లో ఎలాంటి ఛాలెంజస్ ఎదుర్కొన్నారు?

రియల్ లొకేషన్స్ లో షూట్ చేయడం ఎప్పుడూ కూడా సవాల్ తో కూడుకున్నదే. ఈ సినిమా కోసం అన్ని రియల్ లొకేషన్స్ లోనే షూట్ చేశాం. రియల్ స్లమ్స్, గార్బేజ్, డంపింగ్ యార్డ్స్ లో తీసాము. బొంబాయిలో సినిమాని సూట్ చేయడం మరో ఛాలెంజ్. రియల్ వీధుల్లో సినిమాని సూట్ చేయడం జరిగింది. అది రియల్ ఛాలెంజ్.మేము బడ్జెట్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. కంటెంట్ కు కావలసిన బడ్జెట్ తో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేశాం.సినిమాని చాలా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాము. దాదాపు 1600 స్క్రీన్స్ లో సినిమా రిలీజ్ కాబోతోంది. చాలా అద్భుతమైన ఓపెనింగ్స్ వస్తాయనే నమ్మకం వుంది.

నాగార్జున గారిని ఎలా ప్రాజెక్టులో తీసుకొచ్చారు?

నాగార్జున గారితో వర్క్ చేయాలని మాకు ఎప్పటినుంచో ఉండేది. శేఖర్ గారికి ఈ పాత్ర కోసం నాగార్జున గారు తప్పితే మరొకరు కనిపించలేదు. నాగ్ సర్ కి ఈ కథ నచ్చింది.ఆయన చాలా అద్భుతంగా నటించారు.ఆయన్ని తప్పితే మరొకరిని ఆ పాత్రలో ఊహించలేనంత గొప్పగా పెర్ఫార్మ్ చేశారు.

దేవిశ్రీప్రసాద్ గారి మ్యూజిక్ గురించి ?

దేవిశ్రీ అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమా కోసం చాలా డిఫరెంట్ సాంగ్స్ ఇచ్చారు. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ధనుష్ గారు రెండు పాటలు పాడారు. ఇది డైరెక్టర్ గారు, దేవిశ్రీ గారి కలెక్టివ్ డెసిషన్.

తమిళ్ లో కూడా మీరే రిలీజ్ చేస్తున్నారా?

లేదండి. రాహుల్ అనే డిస్ట్రిబ్యూటర్ కి ఇచ్చాము.

సునీల్ గారు.. మీ అమ్మాయి జాన్విని నిర్మాతగా చేయాలనే భావిస్తున్నారా?

ఖచ్చితంగా అండి. తనకి సినిమా నిర్మాణం పట్ల చాలా ఆసక్తి ఉంది. చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే మా బ్రదర్ వాళ్ళ అబ్బాయి కూడా ప్రొడక్షన్ పై ఆసక్తి ఉంది.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి?

శేఖర్ కమ్ముల గారితో మరో సినిమా చేయనున్నాం.అయితే ఇంకా హీరో ఎవరనేది ఫైనల్ కాలేదు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.