మంచు విష్ణు భారీ బడ్జెట్ మూవీ కన్నప్ప మరో 15 రోజుల్లో థియేటర్లలోకి రానుంది.దాంతో ప్రమోషన్స్ భారీగానే చేస్తున్నారు.అందులో భాగంగా ట్రైలర్ రిలీజ్ కానుంది.అయితే ఈ ట్రైలర్ రేపు రిలీజ్ కావాల్సివుండగా వాయిదాపడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఈరోజు మధ్యాహ్నం ఘోర విమాన ప్రమాదం జరిగింది.అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఓ బిల్డింగ్ మీద కుప్పకూలిపోయింది.దాంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.ఈప్రమాద సమయంలో విమానంలో 242 మంది వున్నారు.ఇందులో100 కిపైగా చనిపోయారని ఇప్పటికే ప్రకటించారు.మిగితా వివరాలు తెలియాల్సివుంది.
ఇక ఘటన నేపథ్యంలో కన్నప్ప ట్రైలర్ విడుదలను ఒక రోజు వాయిదావేస్తున్నామని మంచు విష్ణు ప్రకటించారు.రేపు ఇండోర్ లో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా క్యాన్సల్ చేశారు.ముఖేష్ కుమార్ సింగ్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా మంచు విష్ణు ,మోహన్ బాబు ,రెబల్ స్టార్ ప్రభాస్ ,మోహన్ లాల్ ,అక్షయ్ కుమార్, కాజల్ కీలక పాత్రల్లో నటించారు.ఇందులో ప్రభాస్ ఉండడంతో సినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.హిట్ టాక్ వస్తే కన్నప్ప భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























