శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ ,రష్మిక మందన్న,నాగార్జున నటిస్తున్న సినిమా కుబేర మరో 9రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడం తో ప్రస్తుతం ప్రమోషన్స్ చేస్తుంది కుబేర టీం.అందులో భాగంగా నిన్న ముంబై లో ఈవెంట్ జరిగింది. ఈవెంట్ లో కుబేర థర్డ్ సింగిల్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పిప్పీ పిప్పీ డుమ్ డుమ్ డుమ్ అంటూ ఈ సాగే ఈ పాటను వు అంటావా మావా ఫేమ్ ఇంద్రావతి చౌహన్ పాడగా చైతన్య పింగిళి రచించాడు.అయితే లిరికల్ సాంగ్ కాకుండా ఫుల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.రష్మిక మందన్న మీద చిత్రీకరించిన ఈ సాంగ్ ఆకట్టుకుంది.
ఇక ఈనెల 13న హైదరాబాద్ లోని జె ఆర్సీ కన్వెన్షన్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపాలని చూస్తున్నారు.ఇందులో ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈసినిమా 3 గంటల రన్ టైం తో థియేటర్లోకి రానుంది.దాదాపు 100కోట్ల బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి,అమిగోస్ క్రియేషన్స్ ఈసినిమాను నిర్మిస్తున్నాయి.నార్త్ అమెరికా లో ఈసినిమాను ప్రత్యంగిరా సినిమాస్ రిలీజ్ చేస్తుంది.హిట్ టాక్ వస్తే కుబేర భారీ ఓపెనింగ్స్ రాబట్టుకోనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























