వూహించనట్లుగానే అఖండ 2 టీజర్ కు సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది.భారీ అంచనాల మధ్య ఈ టీజర్ నిన్న రిలీజ్ అవ్వగా ఫ్యాన్స్ ఫుల్ కిక్ ఇచ్చింది. యాక్షన్ ప్యాక్డ్ గా వచ్చిన ఈ టీజర్ యూట్యూబ్ లో సెన్సషనల్ వ్యూస్ రాబట్టుకుంటుంది.24గంటల్లో 22 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టి ట్రెండింగ్ లో కొనసాగుతుంది.ఓవరాల్ గా టీజర్ తో సినిమాపై వున్న అంచనాలను డబుల్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బోయపాటి శ్రీనివాస్ ,బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం జార్జియాలో షూటింగ్ జరుపుకుంటుంది.ఇందులో పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు.ఇక బోయపాటి – బాలకృష్ణ కాంబో లో ఇది నాలుగో సినిమా.ఇంతకుముందు వచ్చిన మూడు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి హిట్ అయ్యాయి.మరి అఖండ 2 ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
ఇందులో సంయుక్త మీనన్ కీలక పాత్రలో నటిస్తుండగా ఆది పినిశెట్టి విలన్ గా కనిపించనున్నాడు.తమన్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తుంది.సెప్టెంబర్ 25న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.అయితే అదే రోజున పవన్ కళ్యాణ్ ఓజీ కూడా రిలీజ్ కానుంది.దాంతో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోటీ ఉండనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: