చాలా గ్యాప్ తరువాత ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ ,హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది.2023 లోనే ఈసినిమా లాంఛ్ కాగా 20శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.అయితే ఆ తరువాత పవన్ పొలిటికల్ గా బిజీగా అవ్వడంతో షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.ఇక ఈసినిమా కొత్త షెడ్యూల్ ఈరోజే ప్రారంభమైంది.హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఈ షూటింగ్ జరుగుతుంది.పవన్ కళ్యాణ్ ఈరోజు మధ్యాహ్నం నుండి జాయిన్ అయ్యాడు.శ్రీ లీల కూడా ఈ షూటింగ్ లో పాల్గొంటుంది.దాదాపు నెల రోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగనుంది.దింతో సగానికిపైగా షూటింగ్ కంప్లీట్ కానుంది.పవన్ డేట్స్ ఇవ్వడంతో వీలైనంత తొందరగా షూటింగ్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారు.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.
ఇక ఇదిలావుంటే కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ఓజీ షూటింగ్ కంప్లీట్ చేశాడు.సుజీత్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా ప్రియాంక మెహన్ హీరోయిన్ గా నటిస్తుంది.ప్యాచ్ వర్క్ పూర్తి చేయాల్సివుంది.గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా డివివి దానయ్య నిర్మిస్తున్నారు.సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా కన్నా ముందు పవన్ ,హరి హర వీరమల్లుతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో క్రిష్ ,జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేయగా ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.భారీ బడ్జెట్ తో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: