గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ‘అఖండ 2: తాండవం’ వస్తోంది. ఈ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ కోసం వీరు నాలుగోసారి కొలాబరేట్ అయ్యారు. తాజాగా డబుల్ అప్‌డేట్‌లతో సర్ప్రైజ్ చేసింది చిత్ర యూనిట్. కాగా రేపు బాలకృష్ణ 65వ జన్మదినం జరుపుకోబోతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో ఆయన పుట్టినరోజుకు ఒక రోజు ముందు నేడు అఖండ 2 నుంచి మూవీ ఫస్ట్ లుక్ మరియు టీజర్ విడుదలచేశారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా క్యురియాసిటీని క్రియేట్ చేస్తోంది. నంది, డమరుకంతో కూడిన త్రిశూలం, దాని నేపథ్యంలో విశ్వ దిక్సూచి ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది. బాలయ్య పుట్టినరోజుకు నందమూరి అభిమానులకు ఇది డబుల్ ట్రీట్ అని చెప్పొచ్చు.
టీజర్ అయితే అమేజింగ్‌గా ఉంది. ఈ సినిమాతో బాలకృష్ణ మరోసారి తన నట విశ్వరూపం చూపించబోతున్నాడని అర్ధమవుతోంది. ముఖ్యంగా అఘోరా పాత్రలో బాలయ్య లుక్, గెటప్, డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. బోయపాటి మార్క్ యాక్షన్ అడుగడుగునా కనిపిస్తోంది. ఇక ఎస్. తమన్ అందించిన మ్యూజిక్ అయితే టాప్ నాచ్ అని చెప్పొచ్చు. విజువల్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. టీజర్ చూశాక ఒక ట్రాన్స్ లోకి వెళ్లిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. మొత్తానికి ఈ హై-ఆక్టేన్ సీక్వెల్ కథ, స్కేల్, నిర్మాణం, సాంకేతిక నైపుణ్యం.. ప్రతి అంశంలో అఖండను మించి ఉంటుదని హామీ ఇస్తోంది.
సినిమా షూటింగ్ షెడ్యూల్ ప్రకారం జరుగుతోంది. టాలీవుడ్ లక్కీ చార్మ్ సంయుక్త ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుండగా.. డైనమిక్ ఆది పినిశెట్టి ఇంటెన్స్ పాత్రని పోషిస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 25న అఖండ 2 పాన్ ఇండియా వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: