ప్రేమలు ఫేమ్ నస్లేన్ హీరోగా నటించిన సినిమా అలపుజ్జ జింఖానా.ఏప్రిల్ లో విడుదలైన ఈసినిమా మలయాళం లో 60కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.అంతేకాదు ఈఏడాది థర్డ్ హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది.స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈసినిమా తెలుగులో జింఖానా గా విడుదలై సరైన రెస్పాన్స్ తెచ్చుకోలేకపోయింది.ఇక ఈసినిమా ఓటీటీలోకి రానుంది.సోనీ లివ్ ఈసినిమాను మలయాళం తోపాటు మిగితా భాషల్లో ఈనెల 13నుండి అందుబాటులోకి తీసుకురానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఖలీద్ రెహమాన్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా షైన్ టామ్ చాకో, లక్వార్మ్ అవరన్ ,సందీప్ ప్రదీప్ ,గణపతి కీలక పాత్రల్లో నటించారు.విష్ణు విజయ్ సంగీతం అందించగా ఖలీద్ రెహమాన్ , జోబిన్ జార్జ్ నిర్మించారు.
ఇక ప్రేమలు తో గత ఏడాది 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చి సెన్సేషన్ సృష్టించాడు నస్లేన్.ఈసినిమా తెలుగులో కూడా విడుదలై 10కోట్ల వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఈసినిమా తరువాత నస్లేన్ ఫుల్ బిజీ అవుతున్నాడు.ప్రస్తుతం ఈహీరో ,దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.ఈరోజు ఈసినిమానుండి అప్డేట్ రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























