నాని దసరాలో విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది.ఈరోజు ఉదయం కుటుంబంతో కలిసి కారులో వెళ్తుండగా ఆ కారు అదుపుతప్పి ఆగి వున్న లారీ ను డీ కొట్టడంతో షైన్ టామ్ తండ్రి మృతి చెందారు. మిగిలిన వారికి గాయాలయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు ఉదయం షైన్ టామ్ చాకో తన కుటుంబంతో కలిసి తండ్రి సీపీ చాకోకు వైద్య పరీక్షల కోసం త్రిసూర్ నుండి బెంగళూరుకు వెళ్తుండగా పాలకొడ్‌లోని పయ్యూర్ వద్దకు వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ఒక నిలిపి ఉంచిన లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో షైన్ టామ్ తండ్రి సీపీ చాకో అక్కడికక్కడే మృతి చెందారు.
షైన్, అతని సోదరుడు జో జాన్ చాకో, అలాగే కారు డ్రైవ్ చేసిన నటుడి మేనేజర్ అనీస్ గాయాలతో పాలకొడ్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స పొందారు. అనంతరం వారిని ధర్మపురి మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారని తెలిపారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























