AA 22 x A 6 ఫస్ట్ హీరోయిన్ రివీల్

deepika padukone on board for aa22xa6

పుష్ప 2 తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ తన 22వ సినిమా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో చేయనున్నాడని తెలిసిందే.అట్లీకి ఇది 6వ సినిమా.దాంతో ఈ ప్రాజెక్ట్ కు AA 22 x A 6 గా పిలుస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో వుంది. అన్ని కుదిరితే సెప్టెంబర్ నుండి సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారు.ఇక ఈసినిమాలో ముగ్గురు హీరోయిన్లు వున్నారని ప్రచారం జరుగుతుంది.అందులో ఓ హీరోయిన్ ను ఈరోజు రివీల్ చేశారు మేకర్స్.బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకోనె ను ఈసినిమాలో ఓ హీరోయిన్ గా తీసుకున్నారు.ఈసందర్భంగా అనౌన్స్ మెంట్ వీడియో ను రిలీజ్ చేశారు. రీసెంట్ గా మూవీ అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్ చేయగా తాజాగా హీరోయిన్ అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్ చేశారు.ఈవీడియో లతోనే సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక దీపికకి తెలుగులో ఇది రెండో సినిమా.ఇంతకుముందు కల్కి 2898 ఏడి ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.ఈసినిమా 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఇక ఇప్పుడు AA 22 x A 6 లోకూడా నటించనుంది.ఇక ఇందులో మరో ఇద్దరు హీరోయిన్లు కూడా వుండనున్నారట.ఈ రోల్స్ కోసం జాన్వీ కపూర్ ,మృణాల్ ఠాకూర్ పేర్లు ఎక్కువగా వినబడుతున్నాయి.

అత్యంత భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ ఈసినిమాను నిర్మిస్తుండగా మ్యూజిక్ డైరెక్టర్ ను ఖరారు చేయాల్సివుంది. వచ్చే ఏడాదిలోగా షూటింగ్ ను కంప్లీట్ చేసి 2027 లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.