బబుల్ గమ్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రశంసలు అందుకున్న ప్రముఖ యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల.ఇక ఈ హీరో ప్రస్తుతం మోగ్లీ 2025లో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నేషనల్ అవార్డ్ విన్నర్ ,కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ తెరకెక్కిస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా మారేడుమిల్లిలో బిగ్ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్ పూర్తి చేశారు.15 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ లో రోషన్ కనకాల చాలా రిస్క్ తీసుకుని యాక్షన్ స్టంట్స్ ని పెర్ఫార్మ్ చేశారు.ఈ సీన్స్ సినిమాలో మేజర్ హైలెట్ గా వుండబోతున్నాయి. ఇక కేవలం ఓ షెడ్యూల్ మాత్రమే బ్యాలెన్స్ ఉండనుంది.త్వరలోనే ఆ షెడ్యూల్ ను కంప్లీట్ చేసి సినిమాను ఈఏడాది చివర్లో విడుదలచేయనున్నారు.
ఇక ఈ నెలలోనే టీజర్ కూడా వదలనున్నారు.ఈ సినిమాలో విజువల్స్, యాక్షన్ హైలెట్ గా ఉండబోతున్నాయి.అలాగే మ్యూజిక్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. మోగ్లీ ఆల్బమ్, బ్యాగ్రౌండ్ స్కోర్ అవుట్ స్టాండింగ్ గా ఉండబోతుంది.ఆడియన్స్ కి కొత్త ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతోంది. కాల భైరవ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: