రీసెంట్ గా విడుదలై ఈఏడాది కోలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది టూరిస్ట్ ఫ్యామిలీ.మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చినా ఈసినిమా మౌత్ టాక్ తో ఇప్పటికీ సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది.నిన్నటి తో దాదాపు 70 కోట్ల వసూళ్లను రాబట్టింది.ఒక్క తమిళనాడులో 50 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.కేవలం 4 కోట్ల బడ్జెట్ తో 35రోజుల్లో తెరకెక్కిన ఈసినిమా బయ్యర్ల పాలిట జాక్ పాట్ లా మారింది.ప్రస్తుతం టూరిస్ట్ ఫ్యామిలీ తమిళ బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానంలో కొనసాగుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా అగ్ర దర్శకుడు రాజమౌళిని కూడా మెప్పించింది.నిన్న సినిమా చూసిన రాజమౌళి ఎక్స్ వేదికగా తన అభిప్రాయన్ని వెల్లడించాడు.సినిమా చూసాను అదిరిపోయింది, అద్భుతమైన సినిమా.అభిషన్ రైటింగ్ ,డైరెక్షన్ చాలా బాగుంది.ఇంతమంచి సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ ఇచ్చినందుకు టూరిస్ట్ ఫ్యామిలీ టీంకు ధన్యవాదాలు అంటూ రాజమౌళి ట్వీట్ చేశాడు.
ఇక రాజమౌళి ట్వీట్ పై టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ అభిషన్ జీవింత్ స్పందించాడు.మీ ట్వీట్ ఆశ్చర్యానికి గురిచేసింది.ఇది నిజంగా మా రోజును మరింత ప్రత్యేకంగా చేసింది.మాటల్లో చెప్పలేని కృతజ్ఞత సర్ అంటూ ట్వీట్ చేశాడు.
బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో ప్రముఖ నటుడు శశి కుమార్ ,సిమ్రాన్ ,మిథున్ జై శంకర్ ,కమలేష్,యోగ లక్ష్మి లీడ్ రోల్స్ లో నటించగా సీన్ రోనాల్డ్ సంగీతం అందించాడు.మిలియన్ డాలర్ స్టూడియోస్,ఎమ్ ఆర్ పి ఎంటర్టైన్మెంట్ నిర్మించాయి.త్వరలోనే ఈసినిమా ఓటిటిలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: