కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నాడు. హీరోయిన్ సాయి ధన్సికతో ఆయన వివాహం జరుగనుంది. ఈ మేరకు సోమవారం జరిగిన ఎంగేజ్‌మెంట్ కార్యక్రమంలో పెళ్లి తేదీని ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్టు 29న వీరి కళ్యాణం జరుగనుంది. విశాల్ పుట్టినరోజు కూడా అదే రోజు కావడం విశేషం. ఇక ప్రస్తుతం విశాల్ పెళ్లి వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా విశాల్, ధన్సిక గత 15 ఏళ్ళుగా మంచి స్నేహితులుగా ఉంటున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా డేటింగ్‌లో ఉన్న వీరు మరికొన్ని రోజుల్లో ఏడడుగులతో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. కాగా హీరో విశాల్‌కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులోకి డబ్ అయ్యి హిట్‌గా నిలిచాయి.
ఇక సినిమాల విషయానికొస్తే.. విశాల్ ఇటీవలే ‘మద గజ రాజ’ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అంతకుముందు ‘మార్క్ ఆంటోనీ’ తో తొలిసారి 100కోట్ల క్లబ్ లోకి ఎంటరయ్యాడు. ప్రస్తుతం ఆయన ఒక తమిళ డిటెక్టివ్ మూవీలో నటిస్తు్న్నాడు. దీనికి ఆయనే స్వయంగా దర్శకత్వం వహిస్తుండటం విశేషం.
అయితే విశాల్, ఓ వైపు సినిమాలలో నటిస్తూనే, మరోవైపు నడిగర్ సంఘం కార్యదర్శిగా తమిళ ఇండస్ట్రీలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక సాయి ధన్సిక తమిళం, కన్నడ, తెలుగుతో పాటు మలయాళ చిత్రాల్లోనూ నటించింది. రజనీకాంత్ ‘కబాలి’ చిత్రంలో ఆయన కూతురిగా నటించి తన నటనతో అందరి ప్రశంసలు అందుకుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: