జన నాయగన్ లో ఆ ఒక్క ఎపిసోడ్ మాత్రమే

Just choose one episode from Bhagavanth Kesari for Jana Nayagan

దళపతి విజయ్ ప్రస్తుతం జయ నాయగన్ చేస్తున్న విషయం తెలిసిందే.ఇదే తనకు ఇదే చివరి సినిమాకానుంది. ఆ తరువాత పొలిటికల్ గా బిజీ కానున్నాడు.ఇక ఈసినిమా తెలుగులో సూపర్ హిట్ సాధించిన భగవంత్ కేసరికి రీమేక్ గా వస్తుందని గతంలో వార్తలు వచ్చాయి.కానీ డైరెక్టర్ వినోత్ ఈ వార్తలను కొట్టిపారేశాడు.జన నాయగన్ రీమేక్ కాదని పక్కా  కమర్షియల్ ఎంటర్టైనర్ గా రానుందని క్లారిటీ ఇచ్చాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే భగవంత్ కేసరిని రీమేక్ చేయడం లేదు కానీ ఓ ఎపిసోడ్ ను మాత్రం వాడుకుంటున్నారు జన నాయగన్ మేకర్స్.ఇందులో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి స్కూల్ పిల్లలకి బాలకృష్ణ వివరించే ఎపిసోడ్ ప్రశంసలు అందుకుంది.ఇక ఈ ఎపిసోడ్ ను మాత్రమే జన నయగాన్ లో వాడుతున్నారు.ఇందుకోసం భగవంత్ కేసరి నిర్మాతకి డబ్బులు కూడా చెల్లించారట.

ఇక ఈసినిమా ఇప్పటివరకు సగని పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది.అక్టోబర్ లోపు బ్యాలెన్స్ షూట్ ను కంప్లీట్ చేయనున్నారు. ఇప్పటికే ఓటిటి డీల్ కూడా క్లోజ్ అయ్యింది.అమెజాన్ ప్రైమ్ ఈ హక్కులను భారీ ధరకు దక్కించుకుంది.

ఈసినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా బాబీ డియోల్,ప్రకాష్ రాజ్,గౌతమ్ మీనన్ ,నరైన్,ప్రియమణి,మమితా బైజు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.కె వి ఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.జనవరి 9న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.