తమిళ స్టార్ హీరో సూర్య చాలా రోజుల తరువాత తెలుగు సినిమా చేస్తున్నాడు.అందులో భాగంగా టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సూర్య 46 వ సినిమా రానుంది.ఈరోజే ఈసినిమా పూజా కార్యక్రమాలతో లాంచ్ అయ్యింది.ద్విభాషా చిత్రంగా తెరకెక్కనున్న ఈసినిమాలో ప్రేమలు ఫేమ్ మామితా బైజు హీరోయిన్ గా నటించనుండగా సీనియర్ నటీమణులు రవీనా టాండన్ ,రాధికా శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్నాయి.వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్లనుండగా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సార్ ,లక్కీ భాస్కర్ తో వరుసగా బ్లాక్ బస్టర్లు కొట్టి ప్రస్తుతం పీక్ ఫామ్ లో వున్నాడు వెంకీ అట్లూరి.దాంతో సూర్య తో చేయబోయే సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.మరోవైపు సూర్య సాలిడ్ హిట్ కొట్టి చాలా ఏళ్ళు దాటిపోయింది.రీసెంట్ గా రెట్రోతో ప్రేక్షకుల ముందుకు రాగ ఈసినిమా తమిళంలో యావరేజ్ అనిపించుకోగా తెలుగులో పూర్తిగా నిరాశ పరిచింది.ఇక ఇప్పుడు టాప్ బ్యానర్ ,సక్సెస్ లో వున్న డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు సూర్య.బిగెస్ట్ హిట్ కొట్టడానికి తనకు ఇంతకన్నా మంచి ఛాన్స్ దొరకదు.ఫామ్ తో సంబంధం లేకుండా సూర్య ఈసినిమాకు హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.
ఇదిలావుంటే ప్రస్తుతం సూర్య తన 45వ సినిమాలో నటిస్తున్నాడు.ఆర్ జె బాలాజీ డైరెక్ట్ చేస్తుండగా త్రిష కథానాయికగా నటిస్తుంది.సగానికిపైగా షూటింగ్ కూడా పూర్తయింది.డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మిస్తుంది.ఈ దీపావళికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు.ఈఏడాది సూర్యకు ఇది సెకండ్ రిలీజ్.మరి ఈసినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: