చైల్డ్ ఆర్టిస్ట్‌గా అందరికీ సుపరిచితం అయిన ప్రముఖ నటుడు, మాస్టర్ భరత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయనకు మాతృ వియోగం కలిగింది. భరత్ తల్లి కమలహాసిని ఆదివారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. అయితే ఆమె మురుకి కారణాలు తెలియాల్సివుంది. చిన్న వయస్సులోనే తల్లిని కోల్పోవడంతో భరత్ తీవ్ర వేదనకు గురవుతున్నారని సన్నిహితులు చెబుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో భరత్ మాతృమూర్తి మృతిచెందిన విషయం తెలిసిన బంధుమిత్రులు వారి ఇంటికి వచ్చి పరామర్శిస్తున్నారు. మరోవైపు దక్షిణాది సినీ ప్రముఖులు పలువురు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. కాగా తెలుగులో చైల్డ్ ఆర్టిస్ట్‌గా భరత్ ఎన్నో సినిమాల్లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగుతోపాటుగా తమిళ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో భరత్ నటించాడు.
‘పంచతంత్రం, వెంకీ, హ్యాపీ, దూకుడు, ఢీ, రెడీ, దేనికైనా రెడీ, కింగ్, బిందాస్, మిస్టర్ పర్‌ఫెక్ట్’ వంటి సినిమాల్లో మాస్టర్ భారత్ అద్భుతమైన కామెడీతో అలరించారు. గతేడాది గోపీచంద్ హీరోగా వచ్చిన ‘విశ్వం’ సినిమాలో చివరిగా కనిపించాడు. అయితే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల మాస్టర్ భరత్‌పై ప్రత్యేక అభిమానాన్ని చూపించేవారు. అందుకే తాను తీసిన అనేక చిత్రాల్లో భరత్ కోసం ప్రత్యేక పాత్రలను సృష్టించేవారు ఆయన.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: