బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుత స్పందనతో, పాజిటివ్ బజ్‌తో ముందుకు దూసుకెళ్తోంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీ నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గడా సమర్పిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా మే 30న వేసవి సీజన్‌లో బిగ్గెస్ట్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీం థియేట్రికల్ ట్రైలర్ ఏలూరులో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. భారీ సంఖ్యలో అభిమానులు ప్రేక్షకులు హాజరైన ఈ వేడుక చాలా సక్సెస్ ఫుల్‌గా జరిగింది. ఏపీ సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ పుట్ట మహేష్, ఎమ్మెల్యేలు రాధాకృష్ణయ్య, చింతమనేని ప్రభాకర్ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.
కథాంశం గ్రామస్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీక అయిన పవిత్ర వారాహి ఆలయం చుట్టూ తిరుగుతుంది. రాష్ట్ర ఎండోమెంట్ మంత్రికి ఆ ఆలయం భూములపై కన్నపడి, వాటిని వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగించాలనే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో గ్రామ శాంతి భంగం అవుతుంది.
అప్పుడు ముగ్గురు స్నేహితులు కలసి, ఆలయాన్ని, దాని వారసత్వాన్ని రక్షించేందుకు బలంగా నిలబడతారు. వారి మధ్య ఉన్న బంధం, ధైర్యం గ్రామ ప్రజలకు ఆశను నింపుతుంది. కమర్షియల్ వాల్యుస్‌తో కూడిన కథను దర్శకుడు విజయ్ కనకమేడల ఎక్సయిటింగ్, ఇంపాక్ట్ ఫుల్‌గా ప్రెజెంట్ చేశారు.
తొలి షాట్ నుండి చివరి ఫ్రేమ్ వరకు సినిమాను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పాత్రలో వెర్సటాలిటీ చూపించి అదరగొట్టారు. ముఖ్యంగా శివ తాండవం సీక్వెన్స్, చివరిలో వచ్చే యాక్షన్ సన్నివేశంలో అద్భుతంగా కనిపించారు. మంచు మనోజ్ ఇంటెన్స్ క్యారెక్టర్ కట్టిపడేశారు నారా రోహిత్ కూడా తన పాత్రను పవర్‌ఫుల్‌గా పోషించి ఆకట్టుకుంటారు.
ఈ ముగ్గురు నటుల పర్ఫార్మెన్స్ అద్భుతంగా నిలిచింది, ప్రతి ఒక్కరికి సమానంగా స్కోప్ ఇచ్చిన దర్శకుడికి క్రెడిట్ దక్కుతుంది. ఆదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్ళై పాత్రలు పర్ఫెక్ట్‌గా వున్నాయి. యాక్షన్, ఎమోషన్స్ సమర్థంగా మేళవించిన ఈ ట్రైలర్, ఒక పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుందని సూచిస్తోంది.
హరి కె వేదాంతం కెమెరా వర్క్ సినిమాకు విజువల్ గ్రాండ్‌నెస్ తీసుకొచ్చింది. శ్రీ చరణ్ పాకాల ఇచ్చిన నేపథ్య సంగీతం ఎమోషన్‌ని ఎలివేట్ చేసింది. బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైన్, చిన్నా కె ప్రసాద్ ఎడిటింగ్ మరింత బలాన్ని ఇచ్చాయి. సత్యర్షి, తూమ్ వెంకట్ డైలాగ్స్ పవర్‌ఫుల్‌గా ఆకట్టుకున్నాయి. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పెన్ స్టూడియోస్ నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: