కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు, ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ సమ్మర్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ #సింగిల్. కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు, వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మే 9న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా అందరినీ అలరించి సమ్మర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ లో మూవీ టీం అంతా పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా ఈ వేడుకకు హాజరైన స్టార్ డైరెక్టర్స్ చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు.
డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. “అరవింద్ గారికి బిగ్గెస్ట్ కంగ్రాట్యులేషన్స్. సక్సెస్ అనేది ఇండస్ట్రీకి ఇప్పుడు చాలా అవసరం ఇలాంటి సమయంలో గీతా ఆర్ట్స్ నుంచి రెండు హిట్స్ కొట్టారు. విష్ణు నాకు చాలా క్లోజ్ బడ్డీ. తను కనిపెట్టిన లాంగ్వేజ్ ఎలా వచ్చిందో తెలుసుకోవాలని ఉంది.”
“విష్ణు లో చాలా పొటెన్షియల్ ఉంది. కచ్చితంగా తన టైమింగ్ నేను ఫ్యూచర్ లో వాడుకుంటాను. శ్రీ విష్ణు వెన్నెల కిషోర్ టైమింగ్ అదిరిపోయింది. కిషోర్ ఈ సినిమాని చాలా చక్కగా ప్రమోట్ చేశాడు. ప్రతి సినిమాని సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం ఇది. తప్పకుండా ఈ సినిమాని సమ్మర్ లో చూడండి” అని అన్నారు.
మరో డైరెక్టర్ వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. “సింగిల్ టీమ్ అందరికీ బిగ్ కంగ్రాట్యులేషన్స్. ఈరోజుల్లో ఆడియన్స్ ని థియేటర్స్లోకి తీసుకురావడం అంత ఈజీ కాదు. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. డైరెక్టర్ కార్తీక్ కి బిగ్ కంగ్రాజులేషన్స్. అల్లు అరవింద్ గారు చాలా పాజిటివ్ పర్సన్. ఆయనతో ట్రావెల్ చేస్తుంటే జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఆయన ఇచ్చే ఎనర్జీ అద్భుతం.
“ఈ సినిమాలో పనిచేసిన అందరు టెక్నీషియన్స్ చాలా అద్భుతమైన వర్క్ ఇచ్చారు వెన్నెల శ్రీ విష్ణు గారు, కిషోర్ అదరగొట్టేసారు. వాళ్ల ఎనర్జీ మెస్మరైజ్ చేసింది. శ్రీ విష్ణును చూస్తే విజయ్ సేతుపతిలా ఎంటర్టైన్ చేస్తున్న శ్రీ విష్ణు వెన్నెల కిషోర్ కి థాంక్యూ.నిర్మాతలకి ఆల్ ది వెరీ బెస్ట్. ఇంత మంచి ప్రొడ్యూసర్స్ ని ఇండస్ట్రీకి ఇచ్చిన అరవింద్ గారికి థాంక్యూ. హ్యాట్రిక్ కొట్టిన గీత ఆర్ట్స్ కి బిగ్ కంగ్రాజులేషన్స్” అని అన్నారు.
అలాగే డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ.. “సింగిల్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన టీమ్ అందరికీ కంగ్రాజులేషన్స్. ఈ సినిమాలో శ్రీ విష్ణు వెన్నెల కిషోర్ గారి టైమింగ్ అదిరిపోయింది. శ్రీవిష్ణు సక్సెస్ ని దర్శకులు వాళ్ళ సినిమా సక్సెస్ అయినట్టు భావిస్తారు. బ్రోచేవారు కథని నమ్మింది శ్రీ విష్ణు. ఆ సినిమాకు వచ్చిన అప్రిసియేషన్ అంతా శ్రీ విష్ణు కే దక్కుతుంది. అంత ధైర్యాన్ని ఇచ్చిన శ్రీ విష్ణు కి థాంక్యూ” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: