బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుత స్పందనతో, పాజిటివ్ బజ్‌తో ముందుకు దూసుకెల్తుతోంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీ నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గడా సమర్పిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా మే 30న వేసవి సీజన్‌లో బిగ్గెస్ట్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీం థియేట్రికల్ ట్రైలర్ ఏలూరులో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. భారీ సంఖ్యలో అభిమానులు ప్రేక్షకులు హాజరైన ఈ వేడుక చాలా సక్సెస్ ఫుల్‌గా జరిగింది. ఏపీ సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ పుట్ట మహేష్, ఎమ్మెల్యేలు రాధాకృష్ణయ్య, చింతమనేని ప్రభాకర్ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా హీరో మంచు మనోజ్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. తొమ్మిది సంవత్సరాలు మీకు దూరంగా ఉన్నాను. నేను ఎప్పుడో చేసిన సినిమాలు గుర్తుపెట్టుకుని అన్న మళ్లీ కం బ్యాక్ ఇవ్వు అని మీరు ఎంతగానో ప్రేమ చూపించారు. మీకు ఎలా థాంక్స్ చెప్పుకోవాలో నాకు తెలియలేదు. సినిమా ద్వారానే మీకు థాంక్స్ చెప్పాలి.”
“సొంత వాళ్ళే దూరం పెట్టిన రోజుల్లో మీరు ఇంత దగ్గరగా చేర్చుకుని ఇంత ప్రేమ పంచుతున్నారంటే ఈ గుండె ఎంత ధైర్యంగా ఉందంటే దానికి మీరే కారణం. నాకు ఇంత ప్రేమ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం. తొమ్మిదేళ్ల తర్వాత భైరవం సినిమాతో రావడం చాలా ఆనందంగా ఉంది. నిర్మాతలు రాధా మోహన్ శ్రీధర్ గారు చాలా ప్యాషన్ తో ఈ సినిమా తీశారు.”
“డైరెక్టర్ విజయ్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. సినిమా చాలా గొప్పగా తీశారు. బెల్లంకొండ సాయి నా తమ్ముడు లాంటివాడు తనతో వర్క్ చేయడం వెరీ ఫన్ ఎక్స్పీరియన్స్. తనకి అన్నగా అండగా ఉంటాను. నారా రోహిత్ నా స్నేహితుడు. చిన్నప్పుడు నుంచి మా అనుబంధం ఉంది. ఫ్యామిలీగా, ఫ్రెండ్ గా అది కొనసాగుతూ ఉంది.”
“2016లో ఒక్కడు మిగిలాడు అనే సినిమా తీశాను. ఆ సినిమాకి రోహిత్ వాయిస్ ఇచ్చారు. ఆ సినిమాతో ఆపాను. మళ్లీ తిరిగి వస్తుంటే నా జీవితం నారా రోహిత్ గారితోనే మొదలైంది. నారా రోహిత్ గారు సాయి గారి పర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్. అందరికీ ఈ సినిమా గొప్ప మైల్ స్టోన్ అవుతుందని నమ్ముతున్నాను.”
“నా జీవితంలో ఎన్ని జరిగినా ఆ శివుడు ఫ్యాన్స్ రూపంలో వచ్చాడు. ఎన్ని జన్మలైనా ఈ జన్మకి మాత్రం నా కట్టే కాలే వరకు నేను మోహన్ బాబు గారి అబ్బాయిని. అది ఎవరూ మార్చలేరు. ఎన్ని జన్మలెత్తినా మీరే నా తండ్రి. మీ దీవెనలు ఎప్పుడూ మాపై ఉండాలని కోరుకుంటున్నాను. భైరవ 30 తారీఖున రిలీజ్ అవుతుంది. సినిమా గొప్ప హిట్ అవుతుంది అని కోరుకుంటున్నాను” అని తెలిపారు
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: