వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న యంగ్ సెన్‌సేషన్ ప్రదీప్ రంగనాథన్ ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. కీర్తిశ్వరన్ దర్శకత్వంలో ఈ చిత్రం యువతకు నచ్చే ఎంటర్టైనర్ గా ఉండనుంది. ప్రదీప్‌కు జోడీగా ‘ప్రేమలు’ ఫేమ్ మమిత బైజూ కథానాయికగా నటిస్తుండగా, సీనియర్ నటుడు శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రదీప్ రంగనాథన్ ఫస్ట్‌లుక్ రిలీజైన తర్వాత ఇప్పుడు మేకర్స్ మమిత బైజూకు సంబంధించిన లుక్‌ను విడుదల చేశారు. దీంతో డ్యూడ్ పై ఎక్సైట్‌మెంట్ ఇంకాస్త పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. డ్యూడ్ సినిమా తమిళనాడు మరియు కర్ణాటక థియేట్రికల్ రిలీజ్ హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సంస్థ రోమియో పిక్చర్స్ సొంతం చేసుకుంది.
కాగా ఈ ప్రాజెక్ట్ కోసం మైత్రి మూవీ మేకర్స్ ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్‌ని ఎంపిక చేసింది. యంగ్ సెన్సేషన్ సాయి అభ్యాంకర్ మ్యూజిక్ అందిస్తుండగా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. లతా నాయుడు ప్రొడక్షన్ డిజైనర్‌గా, భరత్ విక్రమన్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక ఇప్పటికే ప్రొడక్షన్ పూర్తి స్థాయిలో జరుగుతుండటంతో దీపావళి కానుకగా దీనిని అందించడానికి టీం వేగంగా పని చేస్తోంది. డ్యూడ్ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: