నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ హీస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రాబిన్‌హుడ్’. వెంకీ కుడుముల దర్శకత్వంలో వహించిన ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటించగా.. ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో కనిపించడం విశేషం. సూపర్ హిట్ ‘భీష్మ’ తర్వాత నితిన్, వెంకీ కాంబోలో తెరకెక్కిన సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. దీనికితోడు జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో రాబిన్‌హుడ్ మార్చి 28న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే భారీ అంచనాల మధ్య థియేటర్స్‌లోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులని అంతగా అలరించలేకపోయింది. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో ఈ చిత్రం మే 10న స్ట్రీమింగ్‌కి వచ్చేసింది. అయితే కొన్ని చిత్రాలు థియేటర్స్‌లో హిట్ అవకపోయినా ఓటీటీలో మత్రం మంచి రెస్సాన్స్ తెచ్చుకుంటుంటాయి. ఈ కోవలోనే రాబిన్ హుడ్ కూడా ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్‌ను అలరిస్తుంది.
యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో హై ఓల్టేజ్ యాక్షన్ తోడవడంతో ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం రాబిన్‌హుడ్ 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో దూసుకుపోతోంది. గత కొన్ని రోజులుగా ‘రాబిన్‌హుడ్’ జీ5లో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతుండటం విశేషం. కాగా ఈ రాబిన్‌హుడ్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.
రాబిన్‌హుడ్ కథ:-
అనాథ అయిన రామ్ (నితిన్) ఒక దొంగ. ధనవంతులను దోచుకుని పేదలకు సహాయం చేసే మోడ్రన్ రాబిన్‌హుడ్ టైప్. చిన్నతనంలో తన తోటి పిల్లల ఆకలి కష్టాలు చూసి చలించి దొంగగా మారతాడు. అయితే దోచుకోవడానికి రామ్ వేసే ప్లాన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా వుంటాయి. ఇదిలావుంటే, రుద్రకొండ అనే గ్రామంలోని భూమిలో పండే గంజాయికి బాగా డిమాండ్ వుంటుంది.
పరమ క్రూరుడైన విలన్ (దేవదత్త నాగే) ఇంటర్నేషనల్ లెవెల్లో ఎదగాలనే ధ్యేయంతో దుర్మార్గాలు చేస్తుంటాడు. రుద్రకొండ భూమి గురించి తెలుసుకుని అక్కడి భూములను హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇక మరోవైపు ఆస్ట్రేలియాలోని ‘ఏవీ ఫార్మా’ అధినేత అభినవ వాసుదేవ్ (సిజ్జు), కుమార్తె రీనా (శ్రీలీల) రుద్రకొండకి వస్తుంది.
అసలు రీనా రుద్రకొండకి రావడానికి కారణం ఏంటి? తనతో పాటు రామ్ ఎందుకు అక్కడకి వెళ్లాల్సి వస్తుంది? రీనా ప్రాణాలకు ఎవరి వలన ముప్పు ఏర్పడుతుంది? అభినవ వాసుదేవ్‌కి, దేవదత్త నాగేకి మధ్య సంబంధం ఏంటి? ఆస్ట్రేలియాలో ఉండే డ్రగ్స్ మాఫియా డాన్ డేవిడ్ (డేవిడ్ వార్నర్) పాత్ర ఏంటి? అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: