ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’తో త్వరలో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’తో సక్సెస్ అందుకున్న మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తుండగా.. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా నేడు రామ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, మేకర్స్ ఈ సినిమా టైటిల్‌ను అద్భుతమైన గ్లింప్స్ ద్వారా రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆంధ్రా కింగ్ తాలూకా.. టైటిల్ గ్లింప్స్ హైలైట్స్
2000లో ప్రారంభంలో సెట్ అయిన ఈ క్లిప్ హౌస్ ఫుల్ థియేటర్ వెలుపల అభిమానుల సందడితో ప్రారంభమవుతుంది. ఆ సమయంలో థియేటర్ యజమాని, ఆంధ్రా కింగ్ సూర్య కుమార్ లేటెస్ట్ సినిమాకు టికెట్ల కోసం వచ్చే కాల్స్‌తో బిజీగా ఉంటాడు. మొదటిగా అతను VIP రిఫరెన్స్ ఉన్నవారికి టికెట్లు కేటాయిస్తాడు. కానీ తర్వాత విసిగిపోయి ఫోన్‌ను పక్కన పెడతాడు.
అప్పుడే, రామ్ సూర్య కుమార్‌కు స్పెషల్ స్టయిల్‌ని అనుసరిస్తూ, బైస్కిల్‌పై స్టైలిష్ ఎంట్రీ ఇస్తాడు. ‘ఆంధ్రా కింగ్ ఫ్యాన్స్’ అంటూ ధైర్యంగా 50 టికెట్లు అడుగుతాడు. అతని ఆత్మవిశ్వాసాన్ని చూసి థియేటర్ యజమాని మాటలేకుండా టికెట్లు ఇస్తాడు. రామ్, ఫ్యాన్స్‌తో కలిసి సంబరంగా వేడుక చేసుకుంటాడు, తన అభిమాన హీరో భారీ కటౌట్ ముందు హీరోయిక్ పోజ్ ఇస్తాడు.
పేలుతున్న పటాకులతో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ టైటిల్ రివీల్ కావడం అదిరిపోయింది. స్టార్ హీరో అయినప్పటికీ రామ్ ఈ ప్రత్యేక పాత్రలో ఒక గొప్ప అభిమాని పాత్రను పోషించడం విశేషం. అభిమాని పాత్రలో అతని స్టైల్, ఎమోషన్ గొప్పగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అతను సైకిల్‌ను స్టైలిష్‌గా పార్క్ చేసే దృశ్యం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ పాత్ర కోసం రామ్‌కు స్పెషల్‌గా మేకోవర్ కూడా అయ్యారు.
కథలో సూపర్‌స్టార్ కేవలం కటౌట్ రూపంలోనే కనిపించడమే కాక, ఉపేంద్రను స్క్రీన్‌పై ఐకాన్‌గా పరిచయం చేశారు. మహేష్ బాబు పి తన స్పెషల్ హ్యుమర్‌తో పాటు హృదయాన్ని హత్తుకునే కథనాన్ని అందించారు. ఫస్ట్ డే ఫస్ట్ షోలో అభిమానులకు ఇచ్చే ప్రాధాన్యతను చూపించడంలో రైటింగ్ అదిరిపోయింది. ఇది ఓ నాస్టాల్జిక్ ఎక్స్‌పీరియెన్స్, అభిమానుల మనసును తాకే ఎమోషన్‌తో నిండిన జర్నీగా నిలుస్తుంది.
సిద్దార్థ నూని తీసిన విజువల్స్ ప్రతి సన్నివేశానికి జీవం పోస్తాయి. వివేక్–మెర్విన్ అందించిన సంగీతం ఈ అనుభవాన్ని మరింత ఎక్సైటింగ్‌గా మార్చుతుంది. జాతీయ అవార్డు విజేత శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్‌లో తన నైపుణ్యాన్ని మరోసారి చూపించారు. అవినాష్ కొళ్ల అందించిన ప్రొడక్షన్ డిజైన్ సినిమాకి సహజత్వాన్ని తీసుకొచ్చింది.
మొత్తానికి, ఈ టైటిల్ గ్లింప్స్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇది అభిమానుల మనసుని తాకేలా ఉండి, భావోద్వేగంతో పాటు పవర్‌ఫుల్ ఎక్స్‌పీరియెన్స్ అందించే చిత్రంగా ఉండబోతోంది. ఇది ప్రతి స్టార్ అభిమానికి తప్పకుండా డిలైట్ ఫుల్ ఎక్స్‌పీరియెన్స్‌ని అందించబోతోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: