ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ ‘తమ్ముడు’. ఈ చిత్రంలో సీనియర్ యాక్ట్రెస్ లయ కీలక పాత్రను పోషిస్తున్నారు. ప్రస్తుతం తమ్ముడు చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. శ్రీరామ్ వేణు తమ్ముడు సినిమాను వీలైనంత త్వరగా హై క్వాలిటీతో కంప్లీట్ చేసి ప్రేక్షకులకు మర్చిపోలేని సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ అందించబోతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ‘మూడ్ ఆఫ్ తమ్ముడు’ పేరుతో విడుదలైన ఈ గ్లింప్స్ హీరో నితిన్ సహా సినిమాలోని కీలక పాత్రలను హైలైట్ చేసింది. ఇందులో లయ, నితిన్ మధ్య అక్కా, తమ్ముడు బాండింగ్ మంచి ఫీల్ అందించింది. మొత్తానికి ఈ ‘మూడ్ ఆఫ్ తమ్ముడు’ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది.
కాగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థతో హీరో నితిన్, దర్శకుడు శ్రీరామ్ వేణుకు ప్రత్యేక అనుబంధం ఉంది. హీరో నితిన్ దిల్, శ్రీనివాస కళ్యాణం వంటి మూవీస్ చేయగా.. దర్శకుడు శ్రీరామ్ వేణు నాని హీరోగా ఎంసీఏ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వకీల్ సాబ్ వంటి సూపర్ హిట్ చిత్రాలు రూపొందించారు. ఇప్పుడు ఈ ముగ్గురి కాంబినేషన్ లో తమ్ముడు సినిమా వస్తుండటం సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇటీవల వచ్చిన ‘రాబిన్‌హుడ్’ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో తమ్ముడు చిత్రంతో అయినా ఈసారి సాలిడ్ హిట్ అందుకోవాలనే కసితో వున్నాడు నితిన్. దిల్ రాజు ప్రొడక్షన్ నుండి వస్తోన్న మూవీ కావడంతో దీనిపై అంచనాలు భారీగానే వున్నాయి. ఇక బాక్సాఫీస్ వద్ద సోలోగా రానుండటం కూడా నితిన్‌కి కలిసిరానుంది. మరోవైపు నితిన్ దీనితర్వాత దిల్ రాజు నిర్మిస్తున్న ‘ఎల్లమ్మ’లో జాయిన్ కానున్నాడు. ఈ చిత్రానికి ‘బలగం’ ఫేమ్ వేణు ఎల్దండి దీనికి దర్శకత్వం వహించనున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: