లవ్ టుడే ,డ్రాగన్ లతో బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల క్లబ్ లో చేరి సెన్సేషనల్ హిట్స్ అందుకున్నాడు తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్.ఈ రెండు తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యాయి.ఇందులో డ్రాగన్ ఈఫిబ్రవరిలో వచ్చింది.ఇక ఈఏడాది మరో రెండు సినిమాలతో ప్రేక్షకులముందుకు రానున్నాడు ప్రదీప్. కేవలం నెల గ్యాప్ లో ప్రదీప్ నెక్స్ట్ సినిమాలు విడుదలకానున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అందులో భాగంగా తన మూడో సినిమా ఎల్ఐకె (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) రిలీజ్ డేట్ ను ఈరోజు ప్రకటించారు మేకర్స్.సెప్టెంబర్ 18న విడుదలకానుంది.ప్రముఖ హీరోయిన్ నయనతార భర్త విగ్నేష్ శివన్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.నయనతార ఈసినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తోంది.ఈసినిమా తమిళంతోపాటు తెలుగు మలయాళ ,కన్నడ భాషల్లో విడుదలకానుంది.
ఇక ప్రదీప్ 4వ సినిమాను కీర్తిశ్వరన్ అనే కొత్త దర్శకుడి తో చేస్తున్నాడు.రెండు రోజుల క్రితం టైటిల్ తోపాటు రిలీజ్ ఎప్పుడో చెప్పేశారు.యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాకు డూడ్ అనే టైటిల్ ను ఖరారు చేయగా దీపావళికి రిలీజ్ చేయనున్నారు.
ఇందులో ప్రేమలు ఫేమ్ మామితా బైజు హీరోయిన్ గా నటిస్తుండగా శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.కోలీవుడ్ లో మైత్రికి ఇది రెండో సినిమా.మరి ఈరెండు సినిమాలు ప్రదీప్ కు ఎలాంటి రిజల్ట్ ఇస్తాయో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: