ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘హరి హరవీరమల్లు’, ‘ఓజీ’ సినిమాలు తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలన్నింటిపై ఇటు పవర్ స్టార్ అభిమానులతో పాటు అటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. ఇక పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఓజీ సినిమా నుండి ఇప్పటివరకు గ్లింప్స్‌ను మాత్రమే రిలీజ్ చేశారు. దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓజీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన దరిమిలా ఈ మూవీ షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మళ్ళీ ఓజీ షూట్ మొదలైంది. ఈసారితో వీలైనంత త్వరగా దీనిని ముగించి గుమ్మడికాయ కొట్టాలని చూస్తోంది చిత్ర యూనిట్.
కాగా ముంబై బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతోన్న ‘ఓజీ’ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే కిక్ శ్యామ్, వెంకట్ బచ్చు, అజయ్ ఘోష్, మొట్ట రాజేందర్, జీవా, హరీష్ ఉత్తమన్, శాన్ కక్కర్, అభిమన్యు సింగ్, కుమనన్ సేతురామన్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: