నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఫస్ట్ వీకెండ్ థియేటర్లలో సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.నిన్న కూడా సూపర్ హోల్డ్ కొనసాగించడం తో మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 12.85కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.అయితే ఈరోజు నుండి స్ట్రాంగ్ రన్ తప్పనిసరి కానుంది.ఇక ఈసినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 20 కోట్లపైనే రాబట్టాల్సివుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈవారం నోటెడ్ సినిమాలు ఏవి లేకపోవడం అడ్వాంటేజ్ కానుంది.యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పవర్ ఫుల్ రోల్ లో నటించింది.కళ్యాణ్ రామ్ , విజయశాంతికి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాలో హైలైట్ అయ్యాయి.
ప్రదీప్ చిలుకూరి ఈసినిమాను డైరెక్ట్ చేయగా సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది.సోహైల్ ఖాన్ విలన్ గా పాత్రలో కనిపించగా శ్రీకాంత్,యానిమల్ పృథ్వీ రాజ్ ముఖ్య పాత్రలు పోషించారు.అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించాడు.భారీ బడ్జెట్ తో అశోక్ వర్ధన్ ముప్పా,సునీల్ బలుసు ఈసినిమాను నిర్మించారు.
ఇక ఈసినిమా తరువాత కళ్యాణ్ రామ్ తన నెక్స్ట్ సినిమాను ఇంతవరకు ప్రకటించలేదు.నిర్మాత గా మాత్రం ప్రస్తుతం తన బ్యానర్ లో ఎన్టీఆర్ నీల్ తెరకెక్కుతుంది.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది.ఈసినిమాకు మైత్రి మూవీ మేకర్స్ మరో నిర్మాత గా వ్యవహరిస్తుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: