పాన్–ఇండియా విజువల్ ఫీస్ట్ కుబేర ఫస్ట్ సింగిల్ ‘పోయిరా మామా’ రిలీజ్ అయింది. ఇది సౌండ్ సునామీ, మూడు జాతీయ అవార్డ్ విజేతలు ధనుష్, దర్శకుడు శేఖర్ కమ్ముల, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కలయికలో మ్యూజిక్ బ్లాస్ట్. రాక్‌స్టార్ DSP అందించిన ఈ పాట ఎక్స్‌ప్లోసివ్ ఎనర్జీతో ఉంది. ఫుట్ టాపింగ్ బిట్స్ తో ప్రేక్షకులు హృదయాలను వెంటనే గెలుచుకుంటాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ధనుష్ స్వయంగా పాడిన వాయిస్ ఈ పాటకి మరింత ఫీల్ తీసుకొచ్చింది – అతని గాత్రంలో ఉన్న మాగ్నెటిక్ ఫోర్స్ పాటను మరో స్థాయికి తీసుకెళ్లింది.భాస్కరభట్ల రాసిన సాహిత్యం అందరినీ అలరిస్తూ, మాస్ టచ్‌కి తగిన రిథమిక్ మ్యాజిక్ ను అందించింది. శేఖర్ వి.జె అందించిన కొరియోగ్రఫీ పాటను ఒక విజువల్ ట్రీట్ గా మలిచింది.
ధనుష్ డాన్స్‌లో చూపిన స్పిరిట్, ఎనర్జీ, ఒరిజినాలిటీ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. ఇక ఈ పాటలో విజువల్స్, వాయిస్, సాహిత్యం, కొరియోగ్రఫీ అన్నీ కలసి ఒక అద్భుత అనుభూతిని అందిస్తున్నాయి. కాగా మొత్తానికి ‘పోయిరా మామా’ తో కుబేర మీద ఉన్న హైప్ నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంది.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ‘కుబేర’ భావోద్వేగాలు, డ్రామా, గ్రాండ్ విజువల్స్ కలిగిన మల్టీ లింగ్వల్ ప్రాజెక్ట్. జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా మరియు జిమ్ సార్బ్ వంటి స్టార్ తారాగణం ఉంది.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ Pvt Ltd పతాకాలపై సునీల్ నారంగ్ ,పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందించబడింది హిందీ, కన్నడ, మలయాళం భాషలలో విడుదల కానుంది – ఇది ట్రూ పాన్ ఇండియన్ సినిమా.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: