నటీనటులు: అవినాష్ వర్మ, ఆద్య రెడ్డి, నీలిమ పతకంశెట్టి, తదితరులు
సంగీతం: సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ: షోయబ్ అహ్మద్ కే.ఎం
ఎడిటింగ్: అమర్ రెడ్డి కుదుముల
నిర్మాణం: అమృత సత్యనారాయణ క్రియేషన్స్
నిర్మాత: విజయ్ భాస్కర్
దర్శకత్వం: తిరుపతి పాలే
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్వయంకృషితో స్టార్‌డమ్ సంపాదించుకున్న టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ మేనల్లుడు అవినాశ్ వర్మ హీరోగా నటించిన తొలి చిత్రం ‘జగమెరిగిన సత్యం’. తిరుపతి పాలె దర్శకత్వం వహించిన ఈ మూవీ కంప్లీట్ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది. ట్రైలర్‌తోనే సినిమాపై ఆసక్తి క్రియేట్ చేసిన ‘జగమెరిగిన సత్యం’ ఏప్రిల్ 18న థియేటర్లలోకి వచ్చింది.
అయితే ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించిందా? పూర్తి గ్రామీణ వాతావరణంలో రూపొందిన ఈ సినిమా తెలంగాణ పల్లెటూరి జీవన విధానాన్ని కళ్లకుగట్టిందా? రవితేజ మేనల్లుడు అవినాశ్ వర్మ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా ఎలా ఉంది? అనే విషయాలు తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథ:-
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లోని ‘దింద’ అనే పల్లెటూరిలో జరిగే ఓ ప్రేమ కథ. చిన్నతనంలో ఆ గ్రామంలోని తన మేన మామ ఇంటికి వచ్చిన సరిత (ఆద్య రెడ్డి), అక్కడ సత్యం (అవినాశ్ వర్మ)ని చూసి ప్రేమలో పడుతుంది. అయితే వారి ప్రేమకి గ్రామంలోని కులాలు, కుటిల రాజకీయాలు అడ్డుగోడలుగా మారతాయి.
ఈ క్రమంలో ఒకసారి సరిత, సత్యం సన్నిహితంగా ఉన్న సమయంలో తన చిన్నమ్మ చూడడంతో గొడవలు మొదలవుతాయి. ఈ గొడవల కారణంగా సత్యంపై హత్య కేసులో ఇరుకుంటాడు. అయితే ఆ కేసు నుంచి అతడు బయటపడగలిగాడా? వీరి ప్రేమను పెద్దలు అంగీకరించారు? చివరికి వీరి ప్రేమ ఏ తీరాలకు చేరింది? అనేది మిగతా కథ.
విశ్లేషణ:-
కథగా చూస్తే ఇది ఇంతకుముందు ఎన్నో సినిమాల్లో చూసినదే. అయితే ఇక్కడే దర్శకుడు తిరుపతి తన ట్యాలెంట్ ఏంటో చూపించాడు. ఇది తనకి మొదటి సినిమా అయినా తనలో విషయం ఉందని నిరూపించాడు. కథలో భావోద్వేగాలకు పెద్ద పీట వేశాడు. ఒక మామూలు కథని మనసుకు హత్తుకునేలా అద్భుతంగా తెరకెక్కించాడు. పల్లె మనుషుల జీవితాలను నిజాయితీగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. డైరెక్టర్‌కు ఇది బెస్ట్ డెబ్యూ అని చెప్పొచ్చు.
ఈ సినిమాలో ప్రతి ఒక్కరిలో మన ఊరి మనిషిని చూస్తాం. సత్యం చుట్టూ నడిచే పాత్రలన్నీ మనం ఎక్కడో ఓ మూల చూసినట్టే ఉంటాయి. చిన్న చినమ్మతో అతని బంధం, గ్రామంలోని రాజకీయాలు, మనిషి విలువలపై వచ్చిన సవాళ్లు.. ఇవన్నీ కథలో బలంగా రూపుదిద్దుకున్నాయి. ఒక చిన్న ఊరిలో నివసించే సత్యం జీవితం పైకి సాదాసీదాగా కనిపించినా.. లోలోపల ఆత్మవిశ్వాసం, ప్రేమ, బాధ, త్యాగం వంటి భావావేశాలు ఉంటాయి. సత్యం కథ కేవలం ఒక వ్యక్తికి సంబంధించినది కాదు, అది ఒక ఊరి జీవితం.
సినిమా ప్రారంభంలోనే ప్రేక్షకుడిని నేరుగా కథలోకి తీసుకెళ్లిపోయాడు దర్శకుడు. హీరో, హీరోయిన్ మధ్య చిగురించే తొలిప్రేమ, ఆ ఊరి వాతావరణం, ఆచార,వ్యవహారాలు కళ్ళకుకట్టినట్టు ఉంటాయి. ప్రతి సీన్‌లోనూ దృశ్యాలు తెలంగాణ మట్టి వాసనను ప్రేక్షకుడికి గుర్తుచేస్తాయి. ఇలా సహజమైన హాస్యంతో పాటు హృదయాన్ని తాకే భావోద్వేగ సన్నివేశాలతో ఫస్టాఫ్ సాగుతుంది. ఇక సెకండాఫ్‌లో కథ ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది.
ఒక్కసారిగా చుట్టుముట్టిన సమస్యలు, వీటిని ఎదిరించేందుకు సత్యం చేసే తిరుగుబాటుతో ఎమోషనల్ వైపు టర్న్ తీసుకుంటుంది. ఊరిని ఒక కొత్త దిశలో తీసుకెళ్లేలా సత్యం ప్రయత్నం చేయడాన్ని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. ఈ నేపథ్యంలో వచ్చే క్లైమాక్స్ సినిమాకే హైలైట్. చివరిలో సత్యం ఏడుస్తుంటే థియేటర్‌లోని ప్రతి ఒక్కరూ చలిస్తారంటే అతిశయోక్తిలేదు. అంతటి బలమైన భావోద్వేగంతో జగమెరిగిన సత్యం ముగుస్తుంది. ప్రేక్షకుడు చివరికి భారమైన హృదయంతో థియేటర్ నుంచి బయటకు వెళ్తాడు.
నటీనటుల విషయానికొస్తే.. మొదటి సినిమానే అయినా అవినాశ్ వర్మ అద్భుతంగా నటించాడు. సత్యం పాత్రలో అతను చక్కగా ఒదిగిపోయాడు. ఆ పాత్ర తాలూకూ భావాలను తన కళ్ళలో పలికించిన తీరు మెప్పిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో తన భావోద్వేగాలతో ప్రతిఒక్కరినీ కదిలించాడు. విజువల్స్, డైలాగులు బాగున్నాయి. అలాగే హీరోయిన్ ఆద్య రెడ్డికి ఇది చెప్పుకోదగ్గ సినిమా అవుతుంది. స్క్రీన్ పైన ఆమె చాలా అందంగా కనిపించింది. మిగతా నటులు తమ పాత్రల పరిధిమేరకు చక్కగా నటించారు.
ఇక టెక్నిషియన్ల విషయానికొస్తే.. సురేష్ బొబ్బిలి సంగీతం సినిమాకి ప్లస్ అయిందని చెప్పొచ్చు. కొన్ని ఎమోషనల్ సన్నివేశాలకు ఆయన అందించిన బీజీఎమ్ చాల బావుంది. షోయబ్ అహ్మద్ కే.ఎం సినిమాటోగ్రఫీ మూవీకి మరో ఎస్సెట్. తెలంగాణ పల్లెటూరి అందాలను కళ్లకుకట్టింది. అమర్ రెడ్డి కుదుముల ఎడిటింగ్ బావుంది. నటీనటులు కొత్తవారే అయినా నిర్మాతలు ఖర్చుకి ఎక్కడా రాజీపడలేదని అర్ధమవుతుంది.
మొత్తానికి జగమెరిగిన సత్యం ప్రతి ఒక్కరిని అలరించేలావుంది. కథ, పాత్రలు, నటీనటుల పెర్ఫార్మెన్స్ అన్నీ సహజత్వంతో ఉంటాయి. ప్రధానంగా హీరో, హీరోయిన్ పాత్రలతోపాటు చిన్నమ్మ పాత్రలు ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి. గ్రామీణ వాతావరణంలో పెరిగిన వారినే కాకుండా అన్ని వర్గాల వారినీ మెప్పిస్తుంది ఈ చిత్రం.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: