నవీన్ చంద్ర ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘బ్లైండ్ స్పాట్’. మ్యాంగో మాస్ మీడియా బ్యానర్ పై రామ కృష్ణ వీరపనేని నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌కి రాకేష్ వర్మ దర్శకత్వం వహించాడు. అంచనాలను క్రమంగా పెంచుతోంది. కాగా ఈ చిత్రంలో రాశి సింగ్, అలీ రెజా, రవివర్మ, గాయత్రి భార్గవి కీలక పాత్రల్లో కనిపిస్తుండగా.. కిషోర్ కుమార్, హారిక పేడాడ, గురురాజ్ మానేపల్లి, హర్ష్ రోషన్, మాస్టర్ అభిషిక్త్ వంటి తారాగణం నటిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా హీరోయిన్ రాశి సింగ్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఈ సినిమా నాకు చాలా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. ఫస్ట్ డే నుంచే చాలా డిఫికల్ట్ సీన్స్ పెట్టారు. రాకేష్ పర్ఫార్మెన్స్ విషయంలో చాలా పర్టికులర్. ఈ సినిమా అంతా నా క్యారెక్టర్ క్రై చేస్తూనే ఉంటుంది” అని తెలిపారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. “డైరెక్టర్ చాలా క్లారిటీతో ఈ సినిమా తీశారు. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ పెట్టాను. నా ఫేవరెట్ జోనర్‌లో వస్తున్న సినిమా ఇది. నవీన్ చంద్ర గారితో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. ఆయన నాకు చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ కోసం చాలా ఎక్సైటింగ్‌గా ఎదురు చూస్తున్నాను. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























