ఆ క్లూ కనిపెట్టి మెసేజ్ చేస్తే.. వాళ్ళతో కలిసి సినిమా చూస్తా – నవీన్ చంద్ర

వరుస ప్రాజెక్తులతో బిజీగా వున్న వెరీ ట్యాలెంటెడ్ నవీన్ చంద్ర ‘బ్లైండ్ స్పాట్’ అనే మరో ఎక్సయిటింగ్ మూవీతో వస్తున్నారు. రాకేష్ వర్మ దర్శకత్వంలో మ్యాంగో మాస్ మీడియా బ్యానర్ పై రామ కృష్ణ వీరపనేని నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ అంచనాలను క్రమంగా పెంచుతోంది. కాగా ఈ చిత్రంలో రాశి సింగ్, అలీ రెజా, రవివర్మ, గాయత్రి భార్గవి కీలక పాత్రలో కనిపిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అలాగే కిషోర్ కుమార్, హారిక పేడాడ, గురురాజ్ మానేపల్లి, హర్ష్ రోషన్, మాస్టర్ అభిషిక్త్ వంటి తారాగణం నటిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు మేకర్స్. ట్రైలర్ పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేయడంతో బ్లైండ్ స్పాట్ మంచి అంచనాలతో విడుదలకు సిద్ధమవుతోంది.

ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో నవీన్ చంద్ర చిత్ర విశేషాలు పంచుకున్నారు. నవీన్ చంద్ర ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “అందరికీ నమస్కారం. రాకేష్ లాంటి డైరెక్టర్స్ ఇంకా ముందుకు రావాలి. తను చెప్పిన కథ చాలా గమ్మత్తుగా ఉంది. తను కథ చెప్పినప్పుడే సీట్ ఎడ్జ్ కూర్చున్న ఫీలింగ్ కలిగింది. ఈ స్క్రీన్ ప్లే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమా నాకు చాలా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది.”

“రాశి చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ చేసింది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఇంత బాగా రావడానికి కారణం సినిమాలో యాక్టర్స్. వీళ్లంతా అద్భుతంగా పెర్ఫామ్ చేయడంతో నా క్యారెక్టర్ కూడా అద్భుతంగా ఎలివేట్ అయింది. ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. కథను నమ్మి ఒక్కొక్క సినిమా చేసుకుంటూ ముందుకు వస్తున్నాను. ఎప్పటిలాగే మీ సపోర్టు ఉండాలని కోరుకుంటున్నాను.”

“త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం. ఈ సినిమా పోస్టర్లో ఒక క్లూ ఉంది. అది కనిపెట్టి నాకు మెసేజ్ చేస్తే వాళ్లతో కలిసి నేను సినిమా చూస్తాను. రాకేష్ ఆలోచన నన్ను కట్టిపడేసింది. ఈ సినిమా కోసం మా టీమ్ అంతా డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేసింది. రాకేష్ ఒక ఛాలెంజ్‌గా తీసుకుని ఈ సినిమా చేశాడు. ఈ సినిమా మిస్ అవ్వకండి. చాలా మంచి థ్రిల్లర్ ఇది” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.