ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు తిరుమల ఆలయాన్ని సందర్శించారు. ఈ మేరకు శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె ‘శుభం’ చిత్ర యూనిట్‌తో కలిసి కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సమంత బృందానికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఇక దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేదాశీర్వచనం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా నటిగా ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకున్న సమంత ఇటీవల చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ అనే బ్యానర్‌ను స్థాపించిన ఆమె.. తమ తొలి ప్రాజెక్ట్‌గా ‘శుభం’ అనే చిత్రాన్ని నిర్మించారు. దాదాపు అందరూ కొత్తవారితో రూపొందించిన ఈ సినిమాను మే 9న థియేటర్లలో విడుదల చేయనున్నారు. శుభం చిత్రానికి ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించాడు.
ఇక శుభం సినిమాలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరీ, శ్రేయా కొంథం, షాలిని కొండేపూడి, శ్రావణి లక్ష్మి, వంశీధర్ గౌడ్ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఇక శుభం చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా మృదుల్ సుజిత్ సేన్, ప్రొడక్షన్ డిజైనర్‌గా రామ్ చరణ్ తేజ్, ఎడిటర్‌గా ధర్మేంద్ర కాకర్లాడ్ వంటి వారు పని చేస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























