నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో నటించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదలైన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఘన విజయాన్ని సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా యాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. “ఈ సినిమా మొదలు పెట్టినప్పుటి నుంచే సూపర్ హిట్ అవుతుందని నమ్మకంతో మొదలుపెట్టాం. ఆ నమ్మకమే ఈరోజు నిజమైంది. సినిమాకి అన్ని చోట్ల నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కళ్యాణ్ రామ్ గారితో కలిసి ఇంత మంచి సినిమాలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రొడ్యూసర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని తీశారు. ఆ రిజల్ట్ ఈరోజు సినిమా హిట్ ద్వారా తెలుస్తుంది.” అని అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “సినిమా ఇంత బాగా రావడానికి రీజన్ కూడా కళ్యాణ్ రామ్ గారు. ఆయన చాలా అద్భుతంగా సపోర్ట్ చేశారు. సినిమాకి చాలా మంచి ఓపెనింగ్స్ రావడం ఆనందంగా ఉంది. ఇందులో తల్లి కొడుకుల సెంటిమెంటు అద్భుతంగా ఉంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా ఇది. కొడుకు బాధ్యతని ఈ సినిమాలో చాలా అద్భుతంగా చూపించారు. చాలా సంవత్సరాల తర్వాత విజయశాంతి గారితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. సునీల్, అశోక్ గారికి కంగ్రాజులేషన్స్” అని చెప్పారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: