నేచురల్ స్టార్ నాని నుండి నెస్ట్ వస్తున్న సినిమా హిట్ 3.ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.నాని సినిమాల్లోనే ఇప్పటివరకు మోస్ట్ వైలెంట్ మూవీగా వస్తుంది హిట్ 3.ఇక ఈసినిమా పాన్ ఇండియా రిలీజ్ కానుంది.అందులో భాగంగా మలయాళ వెర్షన్ రైట్స్ ను ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ కు చెందిన వేఫరర్ ఫిలిమ్స్ దక్కించుకుంది.దాంతో కేరళలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.దుల్కర్ కు హిట్ 3 ట్రైలర్ బాగా నచ్చడంతో సినిమా రైట్స్ తీసుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నాని ఎప్పటినుండో పాన్ ఇండియా హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. మరి హిట్ 3తో ఆ కోరిక తీరుతుందో చూడాలి. వైలెన్స్ ఎక్కువగా ఉండడంతో ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి ఏ సర్టిఫికెట్ రానుంది.హిట్ 3 శైలేష్ కొలను డైరెక్షన్ లో తెరకెక్కుతుండగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.నానితో కలిసి ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు.మే 1న థియేటర్లలోకి రానుంది.
ఈసినిమా తరువాత నాని ది ప్యారడైజ్ లో జాయిన్ కానున్నాడు.దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈసినిమా మే 2 నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.15నుండి నాని షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.అనిరుధ్ సంగీతం అందిస్తుండగా భారీ బడ్జెట్ తో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.ఈసినిమా పాన్ వరల్డ్ రిలీజ్ కానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: