నటీనటులు: తమన్నా భాటియా, వశిష్ట సింహ, హెబ్బా పటేల్, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి తదితరులు
సంగీతం: బి.అజనీష్ లోక్ నాథ్
సినిమాటోగ్రఫీ: సౌందరరాజన్
ఎడిటింగ్: తమ్మిరాజు
నిర్మాణం: మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్
నిర్మాత: డి.మధు, సంపత్ నంది
దర్శకత్వం: అశోక్ తేజ
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రధానపాత్రలో నటించిన హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘ఓదెల 2’. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో ఆమె నెవర్ బిఫోర్ క్యారెక్టర్‌లో నటించారు. 2022లో వచ్చిన సూపర్ హిట్ ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాకి ఇది సీక్వెల్. దుష్ట శక్తుల బారినుంచి ఓదెల మల్లన్న స్వామి తన గ్రామాన్ని ఎలా కాపాడతాడనే ప్రధాన ఇతివృత్తంతో ఓదెల 2 రూపొందింది.
స్టార్ డైరెక్టర్ సంపత్ నంది ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్ రైటర్‌గా మల్టిపుల్ రోల్స్‌లో వర్క్ చేశారు. అలాగే డైరెక్షన్ సూపర్ విజన్‌ని కూడా అందించారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, ట్రైలర్ సహా ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రయోగరాజ్ లోని మహా కుంభమేళా సాక్షిగా రిలీజ్ చేసిన టీజర్‌తో నేషనల్ వైడ్‌గా సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది.
ఈ నేపథ్యంలో భారీ అంచనాల నడుమ ఓదెల 2 నేడు థియేటర్స్‌లో విడుదలైంది. అయితే మొదటి భాగం ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాని మించి ఇది హిట్ అయిందా? ఈ మూవీపై సంపత్ నంది పెట్టుకున్న నమ్మకం నిజమైందా? ప్రతినాయకుడి పాత్రలో ‘కేజీఎఫ్’ ఫేమ్ వశిష్ట సింహ భయపెట్టాడా? అతడిని ఎదిరించే నాగసాధువు పాత్రలో తమన్నా మైమరిపించిందా? వంటివి తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథ:-
మొదటి భాగంలో చనిపోయిన తిరుపతి (వశిష్ఠ) ఆత్మ పగతో రగిలిపోతుంది. తిరుపతి ఆత్మ క్షోభకు గురి అవ్వాలి అని ఓదెల గ్రామ ప్రజలు అతడికి సమాధి శిక్ష అమలు చేస్తారు. ఈ శిక్ష చేస్తే, తిరుపతి సమాధిలో బాధ అనుభవిస్తాడు అని అనుకుంటారు. అయితే కొన్ని అనూహ్య పరిణామాల మధ్య అతడి ఆత్మ సమాధి నుంచి బయటకి వస్తుంది. వచ్చీరావడంతోనే ఆ ఊరిలో కొన్ని భయానక పరిస్థితులు సృష్టిస్తాడు. ఊరిలోని జనాన్ని ఆవహించి కొత్తగా పెళ్లి అయినా అమ్మాయిల్ని రేప్ చేసి చంపేస్తుంటాడు తిరుపతి.
దీంతో గ్రామ ప్రజలలో తీవ్ర ఆందోళన మొదలవుతుంది. వేరే దారి లేక ఊళ్ళో వాళ్ళు తిరుపతి భార్య రాధ (హెబ్బా పటేల్) చెప్పిన ప్రకారం పరిష్కారం కోసం భైరవి (తమన్నా)ని ఆశ్రయిస్తారు. అందుకు సమ్మతించిన ఆమె ఓదెల గ్రామానికి వస్తుంది. అయితే అక్కడ సమస్య భైరవి భావించినంత సులువుగా పరిష్కారమవదు. ఇంతకూ తిరుపతి ఆత్మను భైరవి కంట్రోల్ చేయగలిగిందా? లేదంటే తిరుపతే పైచేయి సాధించాడా? ఓదెల మల్లన్న తన మహిమను చూపించాడా? అనేది మిగతా కథ.
విశ్లేషణ:-
కథగా చూస్తే ఇది ఒక సోషియో ఫాంటసీ మైథాలజికల్ ఫిల్మ్. ఒక విధంగా ‘అమ్మోరు, అరుంధతి’ చిత్రాల తరహాలో వుంటుంది. అయితే ఇలాంటి కథలకు ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే, తరతరాలుగా మనుషులలో గూడుకట్టుకుపోయిన కొన్ని నమ్మకాల వలన ప్రతి ఒక్కరిలో మానవాతీత శక్తులపై ఎంతోకొంత ఆసక్తి నెలకొంటుంది. అందుకే దుష్టశక్తిపై దైవశక్తి ఆధిపత్యం చూపిస్తుంటే వారు ఒకరకమైన సంతృప్తికి లోనవుతారు.
ఈ కోవలో వచ్చిందే ఓదెల 2. దర్శకుడు అశోక్ తేజ దీనిని ఒక ప్రేతాత్మకి, పంచాక్షరి మంత్రానికి మధ్య జరిగే భీకర యుద్ధంగా రూపొందించాడు. ఆడియెన్స్‌కి అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చేలా తీర్చిదిద్దాడు. ఫస్టాఫ్ అంతా తిరుపతి ఆత్మ బయటకు రావడం, పగప్రతీకారాలతో ఊరిప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, దీంతో వారు అతడి బారినుంచి ఊరిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేయడం వంటి సన్నివేశాలతో ఉత్కంఠగా సాగిపోతుంది.
గ్రామంలోకి నాగసాధువుగా తమన్నా ఎంట్రీతో సెకండాఫ్ మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. తిరుపతి ఆత్మ సమాధి నుంచి తిరిగి పైకి లేవడం, ఊరి ప్రజలపై పగ తీర్చుకుంటుండటాన్ని కనిపెట్టి అతడి ఆటను కట్టించడానికి చేసే ప్రయత్నాలు ఉత్సుకత కలిగిస్తాయి. ఇరువురి మధ్య జరిగే ఈ ఆధిపత్య పోరు ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇస్తుంది. మల్లన్న అంశ. భక్తి ఎలిమెంట్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి.ఇక ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ క్లైమాక్స్ మంచి హై ఇస్తుంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమా మొత్తం తమన్నా పాత్ర చుట్టూ తిరుగుతుంది. తను సింగిల్ హ్యాండ్‌తో భారాన్ని మోసింది. ఇప్పటివరకూ తెరపై ఎక్కువగా గ్లామర్ రోల్స్ లోనే కనిపించిన తమన్నా ఇందులో మాత్రం వైవిధ్యభరిత పాత్ర పోషించింది. ఈ క్యారక్టర్‌లో ఆమె పరకాయ ప్రవేశం చేసిందనే చెప్పాలి. నాగసాధువుగా తమన్నా లుక్ ఒక డివోషనల్ ఫీల్ కలుగజేసింది. అలాగే తొలిసారిగా పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీతో ఆకట్టుకుంది. మొత్తానికి ఈ పాత్ర తమన్నా కెరీర్‌లో నిలిచిపోతుంది.
అలాగే చిత్రంలో తమన్నాకి సరిసమానంగా వశిష్ట సింహ కీలకమైన రోల్ పోషించాడు. ఆమెతో ఢీ అంటే ఢీ అనే పాత్రలో కనిపించాడు. ‘కేజీఎఫ్’ సినిమాలో నెగటివ్ ఛాయలున్న పాత్రలో మెప్పించిన ఆయన ఇందులో మాత్రం అంతకుమించి అనేలా చేశాడు. పగతో రగిలిపోయే తిరుపతి పాత్రలో వశిష్ట సింహ తన యాక్టింగ్‌తో అదరగొట్టాడు. ఇంకా హెబ్బా పటేల్ చెప్పుకోదగ్గ క్యారక్టర్ చేసింది. మిగిలిన వారిలో యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు.
ఇక టెక్నికల్ విషయానికొస్తే సినిమా హై స్టాండర్డ్స్‌లో వుంది. సౌందరరాజన్ అందించిన సినిమాటోగ్రఫీ అద్భుతంగా వుంది. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్‌గా వుంది. లొకేషన్స్, విజువల్స్ చాలా కలర్ ఫుల్‌గా వున్నాయి. కథకు తగ్గ మూడ్‌ని కెమెరా ఓడోసిపట్టడంలో సౌందరరాజన్ ట్యాలెంట్ చూపించాడు. తమ్మిరాజు ఎడిటింగ్ షార్ప్‌గా వుండి రెండున్నర గంటల సినిమాను ఎక్కడా బోర్ కొట్టకుండా చేయగలిగింది.
అలాగే అజనీష్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయింది. చాలా సన్నివేశాలను బీజీఎమ్ బాగా ఎలివేట్ చేసింది. యాక్షన్ సన్నివేశాల్లో వచ్చే సంగీతం గూజ్ బంప్స్ తెప్పించేలావుంది. ఇక మేకర్స్ సినిమాను సూపర్ క్వాలీటీతో నిర్మించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మూవీలో ఎంతో కీలకమైన విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదని అర్ధమవుతోంది.
ప్రేతాత్మ, దైవాంశ వంటి కాల్పనిక కథలు సాధారణ ప్రేక్షకులనే కాకుండా మూవీ క్రిటిక్స్‌ని సైతం మెప్పిస్తాయి. ఈ తరహా కథాంశంతో వచ్చిన ఓదెల 2 కూడా మూవీ లవర్స్‌ని ఆకట్టుకుంది. తమన్నా నటన, స్టోరీ, డైరెక్షన్ సినిమాలో హైలైట్ అయ్యాయి. హార్రర్, థ్రిల్లర్ కోరుకునేవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. అలాగే ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కూడా ఈ మూవీ నచుతుంది. మొత్తానికి అన్నివర్గాల వారిని అలరించేలా వుంది. ఓవరాల్‌గా భారీ అంచనాల మధ్య వచ్చిన ఓదెల 2 ఆ అంచనాలను అందుకుందనే చెప్పొచ్చు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: