మాస్ జాతర ఫస్ట్ సింగిల్ రెస్పాన్స్ అదిరింది

mass jathara first single gets super response

మిస్టర్ బచ్చన్ తరువాత మాస్ మహా రాజా రవితేజ నటిస్తున్న సినిమా మాస్ జాతర.మనదే ఇందంతా అనేది ట్యాగ్ లైన్.రవితేజ కు ఇది 75వ సినిమా.షూటింగ్ కూడా పూర్తికావొచ్చింది.ఇక ఈసినిమా నుండి నిన్న మేజర్ అప్డేట్ ఇచ్చారు.అందులో భాగంగా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు.రవితేజ ఐకానిక్ మూవీ ఇడియట్ లోని చూపుల్తో గుచ్చి గుచ్చి సాంగ్ ట్యూన్ తో ఈ ఫస్ట్ సింగిల్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తూ మేరా లవర్ అంటూ సాగే ఈ పాట కు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.ఇప్పటివరకు యూట్యూబ్ లో 1 మిలియన్ మర్క్ ను క్రాస్ చేసింది.అయితే వ్యూస్ పరంగా డీసెంట్ అనిపించుకోగా సోషల్ మీడియా లో సాంగ్ రెస్పాన్స్ మాత్రం అదిరింది.ముఖ్యంగా రవితేజ ఫ్యాన్స్ ఈ పాటను బాగా ఎంజాయ్ చేస్తున్నారు.మాస్ జాతర, ధమాకా రేంజ్ ఆల్బమ్ అవ్వనుంది.

మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో ఈసినిమాతో తన ప్రైమ్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు.థియేటర్లలో మాస్ జాతర ఫస్ట్ సాంగ్ ఓ ఊపు వూపనుంది.ఇక ఈనెలలో షూటింగ్ మొత్తం కంప్లీట్ కానుంది.జులై లో రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు.ఇందులో రవితేజ రైల్వే పోలీస్ ఫోర్స్ ఆఫీసర్ గా నటిస్తుండగా శ్రీలీల హీరోయిన్ గా చేస్తుంది.నాగవంశీ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

ఈసినిమాపై రవితేజ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.ధమాకా తరువాత రవితేజకు ఆ రేంజ్ హిట్ పడలేదు.దాంతో మాస్ జాతరతో హిట్ కొట్టి తమ అభిమాన హీరో ఫామ్ లోకి రావాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు.ఇక ఈసినిమా రిలీజ్ తరువాతే రవితేజ నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చే ఛాన్స్ వుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.