మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ జాతర’. ‘మనదే ఇదంతా’ ఉపశీర్షికతో వస్తోన్న ఈ సినిమా ఆయనకు 75వ చిత్రం కావడం విశేషం. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హీరో రవితేజ జన్మదినం సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన మూవీ గ్లింప్స్ సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో అందించిన మాస్ బీట్ ఉర్రూతలూగించేలావుంది. ఇక ఈ పాటకి భాస్కరభట్ల రవి కుమార్ సాహిత్యం అందించగా.. భీమ్స్ సిసిరోలియో ఆలపించారు. అలాగే ఈ పాట ఒరిజినల్ (ఇడియట్ సినిమా లోని సాంగ్)కు పాడిన దివంగత సంగీత దర్శకుడు చక్రి గారి వాయిస్ AIలో కంపోజ్ చేశారు. రవితేజ మరోసారి తన గ్రేస్ చూపించాడు. ఆయన స్వాగ్, బాడీ లాంగ్వేజ్ మెస్మరైజ్ చేసేలావుంది. మొత్తానికి రవితేజ ఎనర్జిటిక్ పర్‌ఫార్మెన్స్‌తో సాగిన ఈ పాట సినిమాపై అంచనాలు పెంచేసింది.
కాగా మాస్ జాతరలో రవితేజ రైల్వే పోలీస్ ఫోర్స్ ఆఫీసర్‌గా పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ సిసిరోలియో, విధు అయ్యన్న సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే జూలైలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత నాగవంశీ ఇటీవల ఓ ప్రెస్ మీట్‌లో వెల్లడించారు.
ఇక ఈ సినిమా తరువాత రవితేజ నెక్స్ట్ కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నాడు. దసరా నిర్మాత చెరుకూరి సుధాకర్ నిర్మించనున్నారు. అలాగే ‘మ్యాడ్ స్క్వేర్’ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఒక సోషియో ఫాంటసీ మూవీ చేయనున్నాడు రవితేజ్. అయితే దీనిని కూడా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థే నిర్మించనుండటం గమనార్హం.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: