నేచురల్ స్టార్ నాని తన అప్ కమింగ్ హిట్: ది 3rd కేస్‌లో మోస్ట్ ఇంటెన్స్ అండ్ వైలెంట్ అవతార్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా గ్లింప్స్, టీజర్, పాటలు, ఇతర ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్‌తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
HIT: ది 3rd కేస్ మే 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ఈరోజు వైజాగ్ సంగమ్ థియేటర్‌లో భారీగా తరలివచ్చిన అభిమానులు సమక్షంలో లాంచ్ చేశారు. అనంతరం హైదరాబాద్‌లో ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో నాని హిట్ 3 సినిమాకి సంబంధించి కీలక విషయాలను పంచుకున్నారు.
ఈ ప్రెస్ మీట్‌లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. పొద్దున్న వైజాగ్‍లో ట్రైలర్ లాంచ్ చేసాం. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి నా ఫోన్ మెసేజ్ లతో ఫుల్ అయింది. ట్రైలర్‌కి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ ఇది. చాలా ఆనందాన్నిచ్చింది. గత కొన్ని రోజులుగా మా టీమ్ అంతా చాలా కష్టపడ్డారు.” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఈ మధ్యకాలంలో లాస్ట్ మినిట్‌లో ట్రైలర్స్ ఇస్తున్నారు. ఇంతకుముందు 20 రోజులు ముందు ట్రైలర్ వచ్చేది. ఆ నోస్టాల్జిజియా ఫీలింగ్ మళ్లీ ఇద్దామని ట్రైలర్‌ని ముందుగానే రిలీజ్ చేసాము. ట్రైలర్ కోసం టీం అంత డే అండ్ నైట్ పనిచేసింది. ఈరోజు ట్రైలర్‌కి వస్తున్న రెస్పాన్స్ కారణం శైలేష్ అండ్ టీం. వారందరికీ థాంక్యూ” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: