నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఈ రెండు పాత్రలు మధ్య డైనమిక్స్ కీలకంగా వుండబోతున్నాయి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అర్జున్ S/O వైజయంతి టీజర్, సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ మ్యాసీవ్ ప్రీరిలీజ్ & ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్ లో చిత్ర యూనిట్ అంతా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఈ ఈవెంట్ కి విచ్చేసిన మా సినిమా నటీనటులకు టెక్నీషియన్స్ కి, మీడియా ద్వారా చూస్తున్న తెలుగు రాష్ట్ర ప్రజలకు, ఇక్కడికి విచ్చేసిన అభిమానులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమాకి మూడు ఈవెంట్లు చేశాం. ఆ ఈవెంట్స్ లో మాట్లాడాను. ఈరోజు నేను మాట్లాడటం కన్నా సక్సెస్ మీట్ లో మాట్లాడాలని అనుకుంటున్నాను .”
“కానీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనం చాలా సినిమాలు చూస్తాం. థియేటర్ నుంచి బయటికి వెళ్ళగానే మర్చిపోతాం. కానీ కొన్ని సినిమాలే ఇంటికి వెళ్లాళ్లక కూడా మనసుని హత్తుకునే ఉంటాయి. అలాంటి సినిమా మా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. చాలా రోజులు గుర్తు పెట్టుకుంటారు, ఇది గ్యారెంటీ ఇస్తున్నాను. మీరంతా తమ్ముడు మాటల కోసం ఎదురుచూస్తున్నారు. తమ్ముడు మాట్లాడుతాడు. జోహార్ ఎన్టీఆర్.. జోహార్ హరికృష్ణ.. జైహింద్” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: