కొంచెం ఓర్పుతో ఉండండి, త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను – ఎన్టీఆర్

NTR Promised, He Will Meet His Fans Very Soon

నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఈ రెండు పాత్రలు మధ్య డైనమిక్స్ కీలకంగా వుండబోతున్నాయి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక అర్జున్ S/O వైజయంతి టీజర్, సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ మ్యాసీవ్ ప్రీరిలీజ్ & ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్ లో చిత్ర యూనిట్ అంతా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అభిమానులను చూసిన తారక్ ఎమోషనల్ అయ్యారు. వారినుద్దేశించి ఆయన ఇలా అన్నారు.. “ఇక్కడికి వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. మీ కుటుంబ సభ్యులు మీకోసం ఎదురు చూస్తుంటారు. ప్రతి అభిమాని నాకు చాలా ముఖ్యం. నాన్నగారు ఈ వేదిక మీద ఉన్నప్పుడు ఈ జన్మ అభిమానులకి అంకితం అని చెప్పాను. ఈ జన్మ ఈ జీవితం మీకే అంకితం.”

“త్వరలోనే మళ్లీ మీ అందరినీ కలుసుకుంటాను. కొంచెం ఓర్పు సహనంతో ఉండండి. నందమూరి అభిమానులు అంటే ఓర్పు సహనానికి మారుపేరు. త్వరలోనే కలుసుకుందాం. సరదాగా మాట్లాడుకుందాం. ఆగస్టు 14న వార్ 2 సినిమా రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా కూడా చాలా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా మిమ్మల్ని అలరిస్తుంది. ఇక ఏప్రిల్ 18 వ తారీఖున థియేటర్స్ లో కలుసుకుందాం. అర్జున్ సన్ అఫ్ వైజయంతి చిత్రాన్ని భారీ విజయం దిశగా తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరిని కోరుకుంటున్నాను. జై ఎన్టీఆర్ జోహార్ హరికృష్ణ. అందరికీ ధన్యవాదాలు” అని చెప్పారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.