టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని, బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ తో చేస్తున్న సినిమా జాట్.మైత్రి మూవీ మేకర్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నాయి.ఇక ఈసినిమా ట్రైలర్ ను నిన్న రిలీజ్ చేశారు.కేవలం హిందీ వెర్షన్ మాత్రమే రిలీజ్ చేయగా దీనికి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.పేరుకు హిందీ హీరో తో చేస్తున్నా తెలుగు సినిమా అనే ఫీల్ తెప్పించింది ట్రైలర్.ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా ట్రైలర్ ను కట్ చేశారు.ట్రైలర్ అయితే నార్త్ ఆడియన్స్ కి బాగానే నచ్చింది.ఇప్పటివరకు 25 మిలియన్లకు పైగా డిజిటల్ వ్యూస్ ను తెచ్చుకుంది.త్వరలోనే తెలుగు వెర్షన్ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా లో రణదీప్ హుడా పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించనుండగా, రెజీనా కసాండ్రా ,సయామి ఖేర్, రమ్యకృష్ణ ,జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.తమన్ సంగీతం అందిస్తున్నాడు.హిందీ తోపాటు తెలుగు,తమిళ ఈసినిమా భాషల్లోనూ ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది.
అయితే తెలుగులో ఈసినిమాకు పోటీ ఎదురుకానుంది.అదే రోజు మరో రెండు సినిమాలు విడుదలవుతున్నాయి.అందులో తమిళ స్టార్ హీరో అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ ఒకటి.ఈసినిమాను కూడా మైత్రినే నిర్మిస్తుంది.ఇక ఈసినిమా తోపాటు సిద్దు జొన్నలగడ్డ జాక్ కూడా అదే డేట్ కు వస్తుంది. దాంతో జాట్ కు తెలుగు ,తమిళం లో పోటీ తప్పకపోవచ్చు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: