ప్రముఖ కోలీవుడ్ నటుడు మరియు కరాటే మాస్టర్ షిహాన్ హుస్సేని కన్నుమూశారు. కాగా హుస్సేనీ టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురువు కావడం విశేషం. గత కొన్నిరోజులుగా లుకేమియా (బ్లడ్ క్యాన్సర్) వ్యాధితో బాధపడుతున్న ఆయన, ఈ క్రమంలో చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 60 ఏళ్ల వయస్సులో తుదిశ్వాస విడిచారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక షిహాన్ హుస్సేని మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా తమిళ చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలను వారు కొనియాడారు. కాగా హుస్సేనికి భార్య, కుమార్తె ఉన్నారు. కుటుంబం సమక్షంలో చెన్నైలో నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాకముందు హుస్సేనీ దగ్గర మార్షల్ ఆర్ట్స్, కరాటే, కిక్ బాక్సింగ్ వంటి విద్యల్లో శిక్షణ తీసుకున్నారు. అయన నేతృత్వంలో మెళకువలు నేర్చుకున్న పవన్ కళ్యాణ్ కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా సాధించారు. ఇవేకాకుండా ఆర్చరీలో సైతం అనేకమందికి శిక్షణ అందించారు హుస్సేనీ.
కమల్ హాసన్ నటించిన ‘పున్నగై మన్నన్’తో 1986లో నటుడిగా ఆరంగేట్రం చేసిన హుస్సేని అనంతరం రజనీకాంత్‌తో కూడా కలిసి పని చేశాడు. ‘మక్కళ్ సెల్వన్’ విజయ్ సేతుపతి నటించిన ‘కాతువాకుల రెండు కాదల్ , చెన్నై సిటీ గ్యాంగ్ స్టర్స్’ వంటి సినిమాలలో హుస్సేని చివరిసారిగా నటించారు. ఇక సినిమాలతో పాటు పలు రియాలిటీ షోలలో కూడా ఆయన న్యాయనిర్ణేతగా, వ్యాఖ్యాతగా పనిచేశారు..కాగా చనిపోవడానికి ముందు హుస్సేనీ తన శరీరాన్ని వైద్య పరిశోధన కోసం దానం చేయాలనుకుంటున్నట్టు తెలిజేయడం గమనార్హం.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: