హీరో నితిన్ రాబిన్ హుడ్ తో ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.ప్రామిసింగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల తెరకెక్కించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.మరో నాలుగు రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ప్రమోషన్స్ ను కూడా భారీగా చేస్తున్నారు.నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరిపారు.దీనికి ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ హాజరయ్యాడు.ఇందులో తను క్యామియో రోల్ లో కనిపించనున్నాడు.వార్నర్ కు తోడు శ్రీ లీల ఇందులో హీరోయిన్ గా నటించడంతో సినిమాకు హైప్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నిన్న ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు.ఈ ట్రైలర్ అయితే సినిమా షూర్ షాట్ హిట్ అనిపించేలా వుంది.కామెడీ ,యాక్షన్ మిక్స్ చేసి ట్రైలర్ ను వదిలారు.చివరి షాట్ లో డేవిడ్ వార్నర్ ను చూపెట్టారు.విజువల్స్ కూడా రిచ్ గా వున్నాయి.ఈ ట్రైలర్ ఇప్పటివరకు యూట్యూబ్ లో 10 మిలియన్ల వ్యూస్ తో మొదటి స్థానంలో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.
విడుదలకు ముందు పాజిటివ్ వైబ్ తో వస్తుంది ఈసినిమా.నితిన్ కు ఈసినిమా విజయం తప్పనిసరి కానుంది.సరైన విజయం కోసం చాలా రోజుల నుండే ఎదురుచూస్తున్నాడు.అయితే ఈసినిమాకు ఇతర సినిమాలనుండి పోటీ ఎదురుకానుంది.మలయాళ సినిమా ఎల్2: ఎంపురాన్ మ్యాడ్ స్క్వేర్ కూడా ఈ వారమే వస్తున్నాయి.
ఈరెండు సినిమాలకు కూడా మంచి బజ్ వుంది.దాంతో ఈసినిమాలతో రాబిన్ హుడ్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది.ఇక ఈ సినిమా విజయంపై అయితే నితిన్ సూపర్ కాన్ఫిడెంట్ గా వున్నాడు.మరి రాబిన్ హుడ్ తో నితిన్ కం బ్యాక్ ఇస్తాడో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: