హీరో నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ రాబిన్‌హుడ్. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్ తో నిర్మించింది. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ చీఫ్ గెస్ట్ గా హాజరైన ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. నితిన్ అన్న నాకు ఫ్యామిలీ పర్సన్. నేను ఆయన దిల్ సినిమాకి ఫ్యాన్ ని. ఆయన అ ఆ సినిమాకి అసోసియేట్ గా పని చేశాను మేము ఇద్దరం కలిసి భీష్మ లాంటి సూపర్ హిట్ తీశాం. భీష్మ తర్వాత ఈ సినిమాని చేసాం. ఈ సినిమాని ఇంత గ్రాండ్ గా చేసామంటే కారణం నవీన్ గారు రవి గారు. వారి సపోర్ట్ నేను మర్చిపోలేను.”
“శ్రీలీల అంత బిజీగా ఉన్నప్పుడు కూడా నామీద నమ్మకంతో ప్రాజెక్టులోకి రావడం చాలా ఆనందంగా అనిపించింది. నీరా క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా ఫిట్ అయింది. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి టెక్నీషియన్స్ కి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. కేతిక శర్మ చేసిన అదిదా సర్ప్రైజ్ పాట హ్యుజ్ బజ్ వచ్చింది. ఈ సినిమాలో ఓ రోల్ వుంది. అయితే ఆ రోల్ కి ఒక ఇంటర్నేషనల్ స్టార్ అయితే బాగుంటుందని అనుకున్నాను.”
“ఈ క్యారక్టర్ కోసం సరదాగా డేవిడ్ వార్నర్ గారి పేరు చెప్పాను. కానీ, రవి గారు సీరియస్ గా ట్రై చేసి డేవిడ్ వార్నర్ గారిని ప్రాజెక్టులో తీసుకువచ్చారు. ఈ క్రెడిట్ రవి గారికి ఇస్తాను. రవి గారి నమ్మకం వల్లనే డేవిడ్ వార్నర్ ఈరోజు ఇక్కడి వచ్చారు. ఈ రోల్ యాక్సెప్ట్ చేసిన డేవిడ్ వార్నర్ గారికి థాంక్యూ. ఆ క్యారెక్టర్ లో చాలా సర్ప్రైజ్ ఉంటుంది. మార్చి 28న డెఫినెట్ మీ అందరిని ఎంటర్టైన్ చేస్తాం” అని అన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: