టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నుంచి త్వరలో వస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ‘రాబిన్‌హుడ్’. వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన మూడు పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా మార్చి 28న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. దీంతో మేకర్స్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. దీనిలో భాగంగా ఇటీవలే భీమవరంలోని SRKR ఇంజనీరింగ్ కాలేజీలో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. భారీగా హాజరైన అభిమానుల సమక్షంలో వేడుకగా జరిగిన ఈవెంట్ లో హీరో నితిన్ సినిమా గురించి పలు కీలక విషయాలు పంచుకున్నారు.
ఈ నేపథ్యంలో ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందింది. త్వరలో ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ రాబోతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు హీరో నితిన్ ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ మార్చి 21న సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నట్టు తెలిపాడు. ఇక ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ అందుకోవడంతో.. ఇప్పుడు ఈ ట్రైలర్ కోసం మూవీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో కేతిక శర్మ గ్లామరస్ లుక్ ఆకట్టుకుంది. బోల్డ్, స్టన్నింగ్ పెర్ఫామెన్స్ లతో ఆకట్టుకునే కేతిక శర్మ ఈ సాంగ్ లో అదరగొట్టబోతోంది. కాగా నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ బ్యుటీఫుల్ సినిమాటోగ్రఫీని అందించగా.. కోటి ఎడిటర్‌గా, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: