టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జాట్’. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రంలో సన్నీ సరసన సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా కథానాయికలుగా నటిస్తుండగా.. బీటౌన్ స్టార్ యాక్టర్ రణ్‌దీప్ హుడా విలన్‌గా నటిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో సన్నీడియోల్ జన్మదినం సందర్భంగా చిత్ర యూనిట్ టైటిల్ మరియు మూవీ ఫస్ట్ లుక్ రివీల్ చేయగా వీటికి మంచి స్పందన వచ్చింది. ఇక కొన్నిరోజులక్రితం ఈ సినిమా టీజర్‌ను పుష్ప 2 థియేటర్స్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా స్క్రీనింగ్ చేసిన విషయం తెలిసిందే. అప్పటివరకూ డైరెక్టర్ గోపీచంద్ బాలీవుడ్ హీరోతో ఎలా తీస్తాడా? అని ఎదురుచూస్తున్న సినీ ప్రియులకు దీనితో ఒక క్లారిటీ వచ్చేసింది.
టీజర్ అయితే అదిరిపోయింది. మాంచి మాస్ ఫీస్ట్ లాగా ఉంది. దీంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో తాజాగా టీమ్ జాట్ మరో కీలక అప్‌డేట్ అందించింది. ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ త్వరలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. మార్చి 22న దీనిని విడుదల చేయనున్నట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
కాగా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సంగీతం అందిస్తుస్తుండగా.. రిషి పంజాబి సినిమాటోగ్రఫర్‌గా, అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు. కాగా ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లు మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 10న హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ కానుంది.
అయితే ఏప్రిల్ 10న కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తోన్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కూడా రిలీజ్ కానుంది. ‘మార్క్ ఆంటోనీ’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను కూడా మైత్రి మూవీ మేకర్సే నిర్మిస్తుంది. దీంతో సేమ్ డేట్ కు ఒకే ప్రొడక్షన్ హౌస్ నుండి రెండు సినిమాలు విడుదలకానుండటం విశేషం. నిజానికి అయితే ఈ డేట్‌కు రెబల్ స్టార్ ప్రభాస్ ‘ది రాజాసాబ్’ విడుదల కావాల్సివుంది, కానీ షూటింగ్ ఆలస్యం వల్ల ఆ సినిమా వాయిదా పడింది.
మరోవైపు అదే డేట్‌కు స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘జాక్’ కూడా విడుదలకానుంది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘బేబీ’ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్వీసీసీ బ్యానర్ గ్రాండ్‌గా నిర్మిస్తుంది. సో బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాలతో జాట్ చిత్రానికి గట్టి పోటీయే ఎదురుకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: