క్రేజీ కాంబో రిపీట్ అవుతోంది. కోలీవుడ్ ఆల్ టైమ్ సూపర్ హిట్స్‌లో ఒకటైన ‘ఖైదీ’ సినిమాకు సీక్వెల్ రెడీ అవుతోంది. 2019లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాతో లోకేష్ కనగరాజ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్‌గా దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఇక ఇందులో కార్తీ నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ వీరి కాంబోలో ‘ఖైదీ 2’ షురూ కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి మొదలైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
లోకేష్ కనగరాజ్ తన ఎల్‌సీయూ (లోకేష్ సినిమాటిక్ యూనివర్స్) లో భాగంగా ఇప్పటికే ఖైదీ, విక్రమ్, లియో చిత్రాలను తీశాడు. వీటికి కొనసాగింపుగా ‘ఖైదీ 2, విక్రమ్ 2, రోలెక్స్’ సినిమాలు లైన్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతోన్న ‘కూలీ’ కూడా ఈ ఫ్రాంచైజీలో భాగమే అంటున్నారు. కూలీ తర్వాత కార్తీతో ఖైదీ 2 పట్టాలెక్కించి అవకాశం ఉంది.
తాజాగా ఈ మేరకు విషయాన్ని హీరో కార్తీ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇటీవల డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ జన్మదినం సందర్భంగా హీరో కార్తీ ఆయనకు ఓ స్పెషల్ గిఫ్ట్ అందించాడు. లోకేష్ చేతికి ఒక గోల్డెన్ కడియాన్ని తొడిగాడు కార్తీ. అనంతరం ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
అయితే ‘ఖైదీ2’ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనుంది. ప్రస్తుతం ఈ సంస్థ కన్నడలో ‘టాక్సిక్’, ‘కెడి’, విజయ్ నటిస్తోన్న తమిళ చిత్రం ‘జన నాయగన్’ వంటి భారీ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. ఇదేక్రమంలో ఇప్పుడు ఖైదీ 2 ను కూడా తెరకెక్కించనుంది. ఇక ఖైదీ 2 సినిమాలో ‘ఢిల్లీ’ (కార్తి పాత్ర పేరు) కథను పూర్తిగా ఆవిష్కరించనున్నారు లోకేష్. అయితే అతను జైలుకు ఎందుకు వెళ్లాడు? తన జీవితంలో ఏం జరిగింది? అనే విషయాలను ఆసక్తికరంగా చూపించనున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: