టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి మదర్స్ మిల్క్ బ్యాంక్‌ను ప్రారంభించారు. ఇది నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణలో కీలకం కానుంది. పాలు ఉత్పత్తి చేయలేకపోతున్న తల్లులకు, వారి బిడ్డలకు ఈ సౌకర్యం జీవనదానం కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మేరకు తాజాగా విజయవాడలో పర్యటించిన ఆమె ఆంధ్రా హాస్పిటల్స్‌లో ఈ మిల్క్ బ్యాంక్‌ను లాంచ్ చేశారు. అనంతరం గుండె ఆపరేషన్ చేయించుకున్న పిల్లలను కలిశారు. ఈ సందర్భంగా ఇంటర్వెన్షన్స్ విజయవంతంగా చేసినందుకు మహేష్ బాబు ఫౌండేషన్, ఆంధ్ర హాస్పిటల్స్ యాజమాన్యం, కిడ్స్ కార్డియాక్ టీమ్‌కి ధన్యవాదాలు చెప్పారు నమ్రత.
రోటరీ అంతర్జాతీయ సంస్థ నిధులతో మదర్స్ మిల్క్ బ్యాంకు ప్రాజెక్టు ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. తల్లి పాలు శ్రేష్టమైనవని తెలిపిన ఆమె, తల్లిపాలు తక్కువ ఉన్న పిల్లలకు, నెలలు నిండకుండా పుట్టిన చిన్నారులకు, బరువు తక్కువతో పుట్టిన పిల్లలకు.. మదర్స్ మిల్క్ బ్యాంకు ద్వారా పాలు అందించనున్నట్లు వెల్లడించారు.
అలాగే 9-18 సంవత్సరాల వయస్సు గల బాలికలకు గర్భాశయ క్యాన్సర్ టీకా డ్రైవ్‌ను కూడా ప్రారంభించారు. 2025 నాటికి 1,500 మంది బాలికలకు టీకాలు వేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా ఈ రెండు కార్యక్రమాలు పూర్తిగా ఉచితం. తొమ్మిది నుంచి 18 ఏళ్ల లోపు ఆడ పిల్లలంతా తప్పకుండా హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు నమ్రత.
కాగా గడచిన పదేళ్లలో మహేష్ బాబు ఫౌండేషన్ తరపున 4,500 మంది పిల్లలకు పైగా గుండె ఆపరేషన్లు చేయించినట్లు తెలిపారు నమ్రత. అలాగే మున్ముందు చిన్నారుల కోసం తమ ఫౌండేషన్ సేవలను, కార్యక్రమాలను మరింత విస్తృతం చేయనున్నట్లు ప్రకటించారు. తద్వారా పిల్లల శ్రేయస్సుకి తమ సంస్థ అంకితభావంతో కట్టుబడివుందని చెప్పకనే చెప్పారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: