సూపర్ స్టార్ రజినీకాంత్ ,యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూలీ.రజినీ, లోకేష్ కి తోడు కింగ్ నాగార్జున పవర్ ఫుల్ పాత్ర చేస్తుండడం తో తమిళ్ తోపాటు తెలుగులోకూడా ఈసినిమాకు భారీ హైప్ వుంది.దీనికి తోడు లోకేష్ విక్రమ్ ,లియో రూపంలో వరుసగా రెండు భారీ హిట్లు ఇచ్చి ఉండడంతో కూలీ కోలీవుడ్ ఫస్ట్ 1000 కోట్ల సినిమా అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించాడు.నిన్న ఒక ప్రెస్ మీట్ లో భాగంగా సందీప్ ని కూలీ గురించి అడగగా ఆ సినిమా నేను 45 నిమిషాలు చూశాను.తప్పకుండా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందన్నాడు.అలాగే ఈసినిమాలో తను లేనని కూడా క్లారిటీ ఇచ్చాడు.ప్రస్తుతం సందీప్ స్టేట్మెంట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.ఇక ఈసినిమా షూటింగ్ చెన్నై లో జరుగుతుంది.పూజా హెగ్డే పై స్పెషల్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు.
లోకేష్ కనగరాజ్ సినిమాల్లో స్పెషల్ సాంగ్ ఉండడం ఇదే మొదటి సారి. కూలీలో ఉపేంద్ర,శృతి హాసన్ కీలక పాత్రల్లో కనిపించనుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.ఆగస్టు లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి రజినీకాంత్, జైలర్ 2 ను స్టార్ట్ చేయనున్నాడు.నెల్సన్ ఈసినిమాను డైరెక్ట్ చేయనుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: