పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్, ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన లేటెస్ట్ నవ్వుల బ్లాక్ బస్టర్ మజాకా. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో రీతు వర్మ హీరోయిన్. మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ నవ్వుల బ్లాక్ బస్టర్ మజాకా థాంక్స్ మీట్ ని నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా డైరెక్టర్ త్రినాధరావు నక్కిన మాట్లాడుతూ.. “ఆడియన్స్ థియేటర్స్ లో సినిమాని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. మేము ఏదైతే నవ్వించాలని చేశాము అది సక్సెస్ఫుల్ గా వర్క్ అవుట్ అయింది. లాస్ట్ 15 మినిట్స్ ఎమోషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. నవ్వొచ్చినప్పుడు నవ్వాలి, ఏడుపు వచ్చినప్పుడు ఏడవాలి.. అప్పుడు హెల్త్ చాలా బాగుంటుంది. ఈ రెండు మా సినిమాలో ఉన్నాయి.”
“అంతవరకు సక్సెస్ అయ్యానని ఫీల్ అవుతున్నాను. మజాకా చూసిన ఆడియన్స్ ఇంటికి వెళ్లి సినిమా గురించి చెప్పండి. ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే సినిమా ఇది. మా డైరెక్షన్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఈ సినిమా కోసం చాలా సపోర్ట్ చేశారు. సందీప్ గారు నా మీద నమ్మకంతో ఈ సినిమా చేశారు. సక్సెస్ పట్ల ఆయన చాలా ఆనందంగా ఉన్నారు. అందరూ థియేటర్స్ కి వెళ్ళండి సినిమా చూడండి. ఇది తప్పకుండా థియేటర్స్ లోనే చూడాల్సిన సినిమా. థియేటర్స్ కి వచ్చి ఎంజాయ్ చేయండి” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: