మోస్ట్ సక్సెస్ ఫుల్ పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ బిగ్ స్టార్లతో హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లను నిర్మించడమే కాకుండా కంటెంట్-రిచ్ మూవీలను రూపొందిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ‘మను’ ఫేమ్ ఫణీంద్ర నర్సెట్టితో కాన్సెప్ట్ బేస్డ్ మూవీగా ‘8 వసంతాలు’ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘మ్యాడ్’ ఫేమ్ అనంతిక సనీల్‌కుమార్ ఈ మూవీలో హీరోయన్‌గా నటిస్తోంది. ‘శుద్ధి అయోధ్య’ అనే పాత్రలో ఆమె కనిపించనుంది. ప్రస్తుతం 8 వసంతాలు షూటింగ్ చివరిదశకు చేరుకుంది. దీంతో మేకర్స్ మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టేసారు. దీనిలో భాగంగా ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, శుద్ధి అయోధ్య క్యారెక్టర్ టీజర్ క్యూరియాసిటీని పెంచేసాయి.
ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌తో ముందుకొచ్చారు. 8 వసంతాలు నుండి త్వరలో ఫస్ట్ సింగిల్ రాబోతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు మార్చి 3న ‘అందమా అందమా’ అంటూ సాగే పాటను రిలీజ్ చేయనున్నట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. స్టార్ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ పాట కోసం బ్లాక్ బస్టర్ ట్యూన్ ని కంపోజ్ చేశారు. వనమాలి రాసిన ఈ పాటని హేషమ్ అబ్దుల్ వహాబ్, ఆవని మల్హర్ పాడారు. సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ లీడ్ పెయిర్ కెమిస్ట్రీ బ్యూటీఫుల్‌గా వుంది.
కాగా సంతోషాలు, కన్నీళ్లు, విలువైన పాఠాలతో నిండిన ఒక మహిళ యొక్క ఎనిమిదేళ్ల ప్రయాణాన్ని ప్రజెంట్ చేస్తూ ఈ కథ ఉండబోతోంది. ఫణీంద్ర నర్సెట్టి ఈ పాత్రను అద్భుతంగా రూపొందించారు. ఆమె ఎనిమిదేళ్ల కీలక దశలను హైలైట్ చేస్తూ తన ప్రయాణాన్ని హార్ట్ ఫుల్‌గా చూపించనున్నారు. 19 ఏళ్ల నుంచి 27 ఏళ్ల వరకు ట్రాన్స్ఫర్ చెందే జర్నీని క్యాప్చర్ చేస్తూ అనంతిక సనీల్‌కుమార్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకోనుంది. ఈ జర్నీ వ్యక్తులు, భావోద్వేగాలు, అనుభవాలను ఎక్స్ ఫ్లోర్ చేస్తోంది. షీ ఈజ్ పొయెట్రి ఇన్ మోషన్ అనే ట్యాగ్‌లైన్ కు టీజర్ యాప్ట్ అనిపించింది.
విశ్వనాథ్ రెడ్డి తన అద్భుతమైన సినిమాటోగ్రఫీ ద్వారా సినిమా ఎసెన్స్‌ని ప్రజెంట్ చేయనున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సోల్‌ని కదిలించే స్కోర్ నెరేటివ్‌కి డెప్త్‌ని యాడ్ చేయనుంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా నిర్మాణ విలువలు టాప్ క్లాస్‌గా ఉండనున్నాయి. ఈ చిత్రానికి అరవింద్ మూలే ప్రొడక్షన్ డిజైనర్‌కాగా, శశాంక్ మాలి ఎడిటర్‌గా, బాబాసాయి కుమార్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: