టాలీవుడ్‌లో కొన్నేళ్లుగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలను నేటి జెనరేషన్ ఆడియెన్స్ కోసం మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు మేకర్స్. అయితే ఈ చిత్రాలకు లేటెస్ట్ టెక్నాలజీని జోడించి సరికొత్తగా ప్రేక్షకులకు మంచి ఎక్స్‌పీరియన్స్ అందిస్తున్నారు. ఇది నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు ఈ లిస్టులోకి ఓ స్టోరీ ఓరియెంటెడ్ మూవీ చేరింది. నేచురల్ స్టార్ నాని నటించిన ఈ ఫీల్ గుడ్ ఫిల్మ్ రీ రిలీజ్‌కి రెడీ అయింది. ప్రముఖ తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ తెరకెక్కించిన ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగావుంది. హీరో నాని జన్మదినం సందర్భంగా ఈనెల 24వ తేదీన ఈ మూవీ రీ రిలీజ్ అవుతోంది.
ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య 70MM థియేటర్‌లో 24వ తేదీ ఉదయం 8గంటలకు స్పెషల్ షో ప్రదర్శించనున్నట్టు తెలిపారు. ఇక ఈ సినిమాను వీక్షించాలనుకునేవారికోసం ఈరోజు సాయంత్రం 5గంటల నుండి బుకింగ్స్ ఓపెన్ చేస్తున్నట్టు వెల్లడించారు.
ఫోటాన్ కథాస్, తేజ సినిమా బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిన ఈ చిత్రానికి గౌతమ్ వాసుదేవ్ మీనన్ సహ రచయితగా మరియు సహ నిర్మాతగా కూడా వ్యవవహించారు. కాగా ఇదే సినిమాను తమిళంలో జీవా హీరోగా ‘నీతానే ఎన్ పొన్ వసంతం’ అనే పేరుతో ఏకకాలంలో చిత్రీకరించారు. ఇక ఈ చిత్రంలో కూడా హీరోయిన్ సమంతానే కావడం విశేషం ఆ ఏడాదికిగాను ఈ మూవీ ఐదు నంది అవార్డులను సొంతంచేసుకుంది.
2012లో విడుదలైన ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రంలో నాని సరసన సమంత రూత్ ప్రభు కథానాయికగా నటించింది. ఇద్దరు ప్రేమికుల మధ్య నడిచే సింపుల్ లవ్ స్టోరీకి ఆకట్టుకునే కథనం తోడవడంతో ఈ మూవీ కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. అలాగే నటీనటుల పెర్ఫార్మెన్స్, చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఆల్బమ్, ఎమోషనల్ క్లైమాక్స్.. ఇలా ప్రతిదీ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టాయి.
ముఖ్యంగా ఇందులో నాని, సమంత జంట తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించారు. ఇంకా ఈ సినిమాకు ఇసైజ్ఞాని ఇళయరాజా అందించిన మ్యూజిక్ చార్ట్ బస్టర్ అయింది. యూత్ ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పించిన ఈ సూపర్ హిట్ ఫిల్మ్ మళ్లీ విడుదలకానుండటంతో మూవీ లవర్స్ ఎక్సయిటెడ్‌గా ఉన్నారు. సో మూవీ లవర్స్.. మరోసారి ఈ లవ్ ఎంటర్‌టైనర్‌ను వీక్షించేందుకు గెట్ రెడీ.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: